OTT | ప్రతి వారం ఓటీటీలో వైవిధ్యమైన కంటెంట్ ప్రేక్షకుల ముందుకు వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. జూన్ రెండో వారంలో వినోదాల విందును పంచడానికి పలు చిత్రాలు రెడీ అయ్యాయి. థియేటర్స్‌తో పాటు ఓటీటీల్లో సైతం క్రేజీ ప్రాజెక్ట్స్ అలరించేందుకు సిద్ధం అయ్యాయి. ఈ వీకెండ్ 100కు పైనే సినిమాలు, సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తుండగా వాటిలో చాలా వరకు ప్రధాన కంటెంట్ తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత నిర్మాతగా మారి మొట్ట మొదటి సారి నిర్మించిన శుభం, మలయాళ యువ నటుడు, ప్రేమలు హీరో నటించిన అలప్పుజ జింఖానా, నవీన్ చంద్ర ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎలెవన్ చిత్రాలతో పాటు రానా నాయుడు వెబ్ సిరీస్, బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కేసరి2, తమిళ చిత్రాలు మామన్, డీడీ నెక్స్ట్ లెవల్ వంటి కొత్త చిత్రాలు ఓటీటీ లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూస్తే.. విడుదలై పార్ట్-1, 2(మూవీ) తమిళ్,జోరా కాయ తట్టుంగ (మూవీ) తమిళ్,స్టోలెన్ (మూవీ) హిందీ, సు శీల- సు జీత్ (మూవీ) మరాఠీ, ది అకౌంటెంట్ 2 (మూవీ) ఇంగ్లీష్, ది ఫైర్ అండ్ ది మాత్ (మూవీ) ఇంగ్లీష్, లఫంగే: సప్నే దోస్తి దునియా (వెబ్‌సిరీస్) హిందీ, మ్యాట్ లాక్ (వెబ్‌సిరీస్: సీజన్1) ఇంగ్లీష్ చిత్రాలు ఈ వారంలో ఓటీటీలో సందడి చేయనున్నాయి. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో చూస్తే.. కె.ఓ. (మూవీ) ఫ్రెంచ్, ఇంగ్లీష్, తెలుగులో స్ట్రీమ్ కానుండగా, స్ట్రా (మూవీ) ఇంగ్లీష్, వన్ ఆఫ్ థెమ్ డేస్ (మూవీ) ఇంగ్లీష్, తెలుగు, జిన్నీ అండ్ జార్జియా (వెబ్‌సిరీస్: సీజన్3) ఇంగ్లీష్, తెలుగు, ది సర్వైవర్స్ (వెబ్‌సిరీస్: సీజన్1) ఇంగ్లీష్, హిందీ, టైర్స్ (వెబ్‌సిరీస్:సీజన్2) ఇంగ్లీష్, హిందీ, మెర్సీ ఫర్ నన్ (వెబ్‌సిరీస్: సీజన్1) కొరియా, తెలుగు భాషలలో స్ట్రీమ్ కానుంది.రానా నాయుడు 2జూన్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది.
ఇక జీ5లో చూస్తే ఛాల్: కప్టా: ది డిసిప్షన్ (వెబ్‌సిరీస్: సీజన్1) హిందీ భాషలో స్ట్రీమ్ కానుంది. ఇక యాపిల్ టీవీలో స్టిక్ (వెబ్‌సిరీస్: సీజన్1) ఇంగ్లీష్ భాషలో స్ట్రీమ్ కానుంది.ఇక సోనీలివ్ లో అలర్ట్ : మిస్సింగ్ పర్సన్స్ యూనిట్ (వెబ్‌సిరీస్: సీజన్3) ఇంగ్లీష్ భాషలో స్ట్రీమ్ కానుంది. జియో హాట్‌స్టార్‌లో ప్రెడేటర్: కిల్లర్ ఆఫ్ కిల్లర్స్ (మూవీ) ఇంగ్లీష్ భాషలో, వై2కే (మూవీ) ఇంగ్లీష్‌లో , గెట్ అవే (మూవీ) ఇంగ్లీష్‌లో, ది హాలివే షిఫ్ట్ (వెబ్‌సిరీస్: సీజన్1) ఇంగ్లీష్, ఫినియస్ అండ్ఫెర్బ్ (వెబ్‌సిరీస్: సీజన్5) ఇంగ్లీష్, నైట్ కోర్ట్ (వెబ్‌సిరీస్: సీజన్3) ఇంగ్లీష్, ఫ్లీటింగ్ లైస్ (వెబ్‌సిరీస్: సీజన్1) స్పానిష్, ఆర్బీఐ అన్లాక్డ్: బియాండ్ ది రూపీస్ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్ భాషలో స్ట్రీమ్ కానుంది. జూన్ 14న జియో హాట్‌స్టార్ లో శుభం ఓటీటీ అరంగేట్రం చేయడానికి రెడీ అవుతోంది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ఆ ఒక్కటి అడక్కు అనే కామెడీ సినిమా జూన్ 12 నుంచి ఈటీవీ విన్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.