Tharun Bhascker | టాలీవుడ్ యువ దర్శకుడు, ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘కీడా కోలా’ వంటి విభిన్న చిత్రాలతో తనదైన ముద్ర వేసిన తరుణ్ భాస్కర్ మళ్లీ మెగాఫోన్ పట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. తన చివరి చిత్రం ‘కీడా కోలా’ విడుదలై దాదాపు ఏడాదిన్నర తర్వాత తరుణ్ కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడానికి సిద్ధమవుతున్నారు.
ఈ మేరకు తరుణ్ భాస్కర్ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. “స్క్రిప్ట్ పూర్తయింది ది ఎండ్” అని రాసి ఉన్న ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌తో తరుణ్ అభిమానుల్లో ఉత్సాహం నిండింది. అయితే, తరుణ్ తదుపరి చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ అవుతుందా, లేక పూర్తిగా కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతున్నారా అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఈ వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.