గండీడ్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి(Bhu Bharati) సర్వేను మండలంలోని సాలార్నగర్ గ్రామం ఎంపికైంది. పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన భూభారతి డిజిటల్ సర్వేను (Digital survey) సోమవారం సాలార్ నగర్ గ్రామంలో అదనపు కలెక్టర్ మోహనరావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సర్వే ఏజెన్సీ సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సర్వే చేయడానికి తీసుకు వచ్చిన డ్రోన్ కొంత సమయం ఎగురవేయగా వాతావరణం అనుకూలంగా లేదని ఎండ ఉంటేనే సర్వే చేయడానికి వీలు పడుతుందని అదనపు కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఏడీ కిషన్ రావు, ఏజెన్సీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.