Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్ సీడీఈ) ద్వారా అందించే ఎంబీఏ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ మొదటి, మూడు సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 24వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో చూసుకోవాలని సూచించారు.
ప్రొఫెసర్ జీబీ రెడ్డిని అభినందించిన ఓయూ వీసీ
కేరళ రాష్ట్రం కొచ్చి లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ లీగల్ స్టడీస్ వైస్ ఛాన్స్లర్గా ఇటీవల నియమితులైన ప్రొఫెసర్ జీబీ రెడ్డిని ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్ సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ నియామకంతో ఓయూ కీర్తి మరింత పెరిగిందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ జితేందర్ కుమార్ నాయక్ పాల్గొన్నారు.