
కొలంబో: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసేందుకు టీమ్ఇండియా తహతహలాడుతున్నది. ఇప్పటికే సిరీస్‌ను తమ ఖాతా లో వేసుకున్న ధవన్ కెప్టెన్సీలోని యువ భారత్.. శుక్రవారం లంకతో మూడో వన్డే ఆడనుంది. సమిష్టి ప్రదర్శన కనబరుస్తున్న టీమ్ఇండియా…ఆఖరి ఆటలోనూ సత్తాచాటాలన్న పట్టుదలతో ఉంది. అయితే గత రెండు మ్యాచ్‌ల్లో తుది జట్టులో అవకాశం దక్కించుకోలేకపోయిన వారికి ఈ మ్యాచ్‌లో చోటు లభించనుంది.