బెంగళూరు : మరికొద్దిరోజుల్లో మొదలుకాబోయే చాంపియన్స్ ట్రోఫీలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడతాడా? లేదా? అన్నదానిపై సందిగ్ధత వీడటం లేదు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆఖరి టెస్టులో వెన్ను నొప్పి కారణంగా ఆ మ్యాచ్ నుంచి తప్పుకున్న బుమ్రా.. ఆదివారమే ఎన్సీఏకు చేరుకున్నాడు. గాయం తీవ్రత, ఫిట్నెస్పై నిర్వహించిన వైద్య పరీక్షలలో సంతోషకరమైన ఫలితాలు రాలేదని తెలుస్తోంది. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో అయితే అతడు ఆడేది అనుమానమేనని బీసీసీఐ ప్రతినిధి తెలిపారు. బుమ్రా విషయంలో బీసీసీఐ కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. ఒకవేళ పూర్తిగా ఫిట్నెస్ సాధించకుంటే బుమ్రా లేకుండానే ఆడాల్సి ఉంటుంది.