IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. విశాఖపట్టణంలో భారీ స్కోర్ చేయడంలో విఫలమైన ఆరెంజ్ ఆర్మీపై ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఛేదనలో ఓపెనర్లు ఫాఫ్ డూప్లెసిస్(50), యువకెరటం జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్(38)లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.
వీళ్లిద్దరూ విధ్వంసక బ్యాటింగ్‌తో పవర్ ప్లేలో 52 పరుగులు పిండుకొని విజయానికి బాటలు వేశారు. ఆ తర్వాత అభిషేక్ పొరెల్(34 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్(15 నాటౌట్) ధాటిగా ఆడి లాంఛనం ముగించారు. పొరెల్, స్టబ్స్ మెరుపులతో మరో 4 ఓవర్లు ఉండగానే ఢిల్లీ ఘన విజయం సాధించింది. తద్వారా మెగా టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది అక్షర్ పటేల్ బృందం.
𝐀 𝐅𝐚𝐟-𝐮𝐥𝐨𝐮𝐬 𝐝𝐢𝐬𝐩𝐥𝐚𝐲 𝐨𝐟 𝐩𝐨𝐰𝐞𝐫 💪
Faf du Plessis entertained the Vizag crowd before departing for 50 (27) 💙#DC are 96/2 after 10 overs.
Updates ▶️ https://t.co/L4vEDKzthJ#TATAIPL | #DCvSRH | @DelhiCapitals pic.twitter.com/lSJ0HxTRfd
— IndianPremierLeague (@IPL) March 30, 2025
ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌పై భారీ విజయంతో టోర్నీని ఆరంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట గాడి తప్పింది. ప్రధాన బ్యాటర్లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరుగుతుండడంతో కమిన్స్ సేనకు వరుసగా రెండో ఓటమి తప్పలేదు. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో చిత్తుగా ఓడిన హైదరాబాద్‌ను శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ గట్టి దెబ్బ కొట్టింది. అనికేత్ వర్మ() మెరుపు ఇన్నింగ్స్ ఆడినా.. మిచెల్ స్టార్క్(5-35) సంచలన బౌలింగ్‌తో ఆరెంజ్ ఆర్మీని 163కే కట్టడి చేశాడు. ఆ తర్వాత ఛేదనలో ఓపెనర్లు ఫాఫ్ డూప్లెసిస్(50), జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్(38) ఫోర్లు, సిక్సర్లతో లక్ష్యాన్ని తేలిక చేశారు. పవర్ ప్లే తర్వాత ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన జీషన్ అన్సారీ(3-42) కీలక వికెట్లు తీసినా అప్పటికే ఢిల్లీ గెలుపు వాకిట నిలిచింది. అభిషేక్ పొరెల్(34 నాటౌట్), స్టబ్స్(15 నాటౌట్) మరో వికెట్ పడకుండా జట్టును 16 ఓవర్లకే విజయ తీరాలకు చేర్చారు.
A Dream Debut ✨
Zeeshan Ansari couldn’t have asked for better wickets in his maiden #TATAIPL appearance 🧡
Scorecard ▶️ https://t.co/L4vEDKyVsb#DCvSRH | @SunRisers pic.twitter.com/WHKiLX30Uw
— IndianPremierLeague (@IPL) March 30, 2025
తొలి మ్యాచ్‌లో 286 రన్స్ కొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తడబడింది. ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ మిచెల్ స్టార్క్ ధాటికి(5-35) టాపార్డర్ వైఫల్యంతో 163 పరుగులకే ఆలౌటైంది. దంచికొట్టే అలవాటున్న ట్రావిస్ హెడ్(22), అభిషేన్ శర్మ(0), ఇషాన్ కిషన్(2)లు మళ్లీ నిరాశపరిచారు. 37 పరుగులకే 4 వికెట్లు పడడంతో ఆరెంజ్ ఆర్మీ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో 23 ఏళ్ల అనికేత్ వర్మ(7441 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు) ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో పాతుకుపోయిన అతడు భారీ సిక్సర్లతో ఢిల్లీ బౌలర్లను బెంబేలెత్తించాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మోహిత్ శర్మ.. ఎవరినీ వదలకుండా ఉతికేశాడు. కుల్దీప్ బౌలింగ్‌లో సింగిల్ తీసి ఐపీఎల్లో తొలి ఫిఫ్టీ నమోదు చేసిన అనికేత్ ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడాడు.
Jump. Timing. Perfection. 🔝
An excellent catch from Jake Fraser-McGurk at the ropes brings an end to Aniket Verma’s fighting knock! 💙
Updates ▶️ https://t.co/L4vEDKzthJ#TATAIPL | #DCvSRH | @DelhiCapitals pic.twitter.com/7b6eekZtRC
— IndianPremierLeague (@IPL) March 30, 2025
అక్షర్ పటేలో వేసిన 15వ ఓవర్లో రెచ్చిపోయిన ఈ యంగ్‌స్టర్ 4, 6, 6 బాదాడు. స్టార్ ఆటగాళ్లు చేతులెత్తేసిన చోట తనదైన శైలిలో బౌండరీలతో చెలరేగిన అతడు హెన్రిచ్ క్లాసెన్(32)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. మోహిత్ శర్మ ఓవర్లో క్లాసెన్ ఔటయ్యాక అనికేత్‌కు డికి సహకారం అందించేవాళ్లు కరవయ్యారు. కుల్దీప్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్(1) బౌండరీ లైన్ వద్ద ఫ్రేజర్ చేతికి చిక్కాడు. దాంతో, 123 వద్ద ఆరెంజ్ ఆర్మీ ఏడో వికెట్ పడింది. ఆ కాసేపటికే బౌండరీ లైన్‌వద్ద ఫ్రేజర్ గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టడంతో అనికేత్ వెనుదిరిగాడు.. ఇక టెయిలెండర్లను ఔట్ చేసిన స్టార్క్ ఈ సీజన్లో తొలిసారి ఐదు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.