అహ్మదాబాద్: రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్(Sanju Samson)కు 24 లక్షల జరిమానా వేశారు. ఐపీఎల్లో బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా ఆ ఫైన్ విధించారు. ఆ మ్యాచ్‌లో రాజస్తాన్ జట్టు 58 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన నేపథ్యంలో ఆ జట్టుకు జరిమానా విధించారు. ఈ యేడాది ఐపీఎల్లో రెండోసారి ఆర్ఆర్ జట్టు స్లో ఓవర్ రేటుతో బౌలింగ్ చేసింది.
చెన్నైతో జరిగిన మ్యాచ్ లో.. ఆర్ఆర్ స్టాండ్ ఇన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌కు ఫైన్ పడ్డ విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో అతనికి 12 లక్షల ఫైన్ వేశారు. జట్టులోని ఇతర ఆటగాళ్లు, ఇంపాక్ట్ ప్లేయర్లకు ఆరు లక్షలు లేదా 25 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించనున్నారు. బ్యాటింగ్ , బౌలింగ్‌లో కొన్ని లోపాలు ఉన్నట్లు మ్యాచ్ ముగిసిన తర్వాత శాంసన్ తెలిపాడు. బౌలింగ్ టైంలో సుమారు 20 రన్స్ అదనంగా ఇచ్చినట్లు పేర్కొన్నాడు.
తొలుత సాయి సుదర్శన్ (53 బంతుల్లో 82, 8ఫోర్లు, 3సిక్స్‌లు) అర్ధసెంచరీకి తోడు బట్లర్ (36), షారుఖ్‌ఖాన్(36) రాణించడంతో టైటాన్స్ 20 ఓవర్లలో 217/6 స్కోరు చేసింది. తుషార్ (2/53), తీక్షణ (2/54) రెండేసి వికెట్లు తీశారు. లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్ 159 స్కోరుకు పరిమితమైంది. హెట్‌మైర్(32 బంతుల్లో 52, 4ఫోర్లు, 3సిక్స్‌లు), శాంసన్(41) రాణించినా లాభం లేకపోయింది. ప్రసిద్ధ్ కృష్ణ (3/24), సాయి కిషోర్(2/20).. రాయల్స్‌ను దెబ్బతీశారు.