Asia Cup 2025 : ఈ ఏడాది పురుషుల ఆసియా కప్ (Asia Cup 2025) తటస్ఠ వేదికపై జరుగనుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆమోదం తెలపడంతో ఈమధ్యే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ టోర్నీని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఏసీసీ ఆసియా కప్ మ్యాచ్‌ల వేదికలను ఖరారు చేసింది. దుబాయ్, అబూదాబీలో మ్యాచ్‌లు జరపాలని ఏసీసీ నిర్ణయించింది. యూఏఈ కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం
ప్రకారం రాత్రి 730 గంటలకు) మ్యాచ్‌లు ప్రారంభం అవుతాయయని ఏసీసీ వెల్లడించింది.
‘ఏసీసీ టీ20 ఆసియా కప్ వేదికలు, మ్యాచ్ సమయాలను నిర్ణయించాం. ఈ మెగా టోర్నీ సందర్భంగా స్టేడియాలు కిక్కిరిసి పోతాయని భావిస్తున్నాం. ఆసియా ఖండంలోని అత్యుత్తమ జట్లు ఈ ప్రతిష్ఠాత్మక ట్రోఫీ కోసం కొదమ సింహాల్లా తలపడనున్నాయి. ఉపఖండం వ్యాప్తంగా అభిమానులకు ఈ టోర్నీ అసలైన క్రికెట్ మజాను పంచనుంది ‘ అని ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) తెలిపాడు.
రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగునున్న ఆసియా కప్‌లో 8 జట్లు పోటీపడనున్నాయి. భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్థార్, యఏఈ, ఒమన్, హాంకాంగ్ జట్లు టైటిల్ పోరుకు సిద్ధమవుతున్నాయి. 19 రోజుల పాటు జరిగే ఆసియా కప్‌లో లీగ్ మ్యాచ్‌లతో కలిపి 19 మ్యాచ్‌ల ఉంటాయి. సెప్టెంబర్ 15న రెండు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. తొలిపోరులో ఒమన్ జట్టు ఆతిథ్య యూఏఈని ఢీకొట్టనుంది. అనంతరం.. శ్రీలంక జట్టు హాంకాంగ్‌తో తలపడనుంది. భారత జట్టు లీగ్ మ్యాచ్‌ల విషయానికొస్తే… సెప్టెంబర్ 10న యూఏఈతో, సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో, సెప్టెంబర్ 19న ఒమన్‌తో ఆడనుంది. టీమిండియా సూపర్ -4 మ్యాచ్‌ల తేదీలు లీగ్ ఫలితాలపై ఆధారపడనున్నాయి. సెప్టెంబర్ 28న ఫైనల్ మ్యాచ్‌తో విజేత ఎవరో తేలిపోనుంది.