జైపూర్: టీమ్ఇండియా మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్ ఐపీఎల్లో పునరాగమనం చేయనున్నట్టు సమాచారం. ఐపీఎల్లో వచ్చే సీజన్ నుంచి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి ద్రావిడ్ హెడ్‌కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడని తెలుస్తోంది. 2012, 2013 సీజన్లలో రాజస్థాన్‌కు సారథిగా వ్యవహరించిన ద్రావిడ్.. ఆ తర్వాత రెండేండ్ల పాటు ఆ జట్టుకు మెంటార్‌గానూ పనిచేశాడు.అతడు మళ్లీ రాజస్థాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం.