Rahul Dravid : భారత హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ (Gautam Gambhir) తొలి పరీక్షను ఎదుర్కొంటున్నాడు. శ్రీలంక పర్యటన అతడి సత్తాకు సవాల్ విసరనుంది. ఐపీఎల్ మెంటార్‌గా హిట్ కొట్టిన గౌతీ అదే ఫార్ములాతో టీమిండియాను విజేతగా నిలపాలనే పట్టుదలతో ఉన్నాడు. లంకతో తొలి టీ20 మ్యాచ్‌కు ముందు మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) అతడికి ఓ వాయిస్ మెసేజ్ పంపాడు. ఆ సందేశాన్ని గంభీర్ వింటున్న వీడియోను బీసీసీఐ ఎక్స్ ఖాతాలో పెట్టింది. ఇంతకూ ద్రవిడ్ ఏం మెసేజ్ పంపాడంటే..?
హల్లో గౌతమ్. ప్రపంచలోనే గొప్ప తృప్తిని ఇచ్చే భారత జట్టు హెడ్‌కోచ్ పదవికి స్వాగతం. నేను కలలో కూడా ఊహించని విధంగా భారత జట్టు కోచ్‌గా వీడ్కోలు పలికి మూడు వారాలు అవుతోంది. బార్బడోస్‌లో ట్రోఫీ అందుకున్న సందర్భం, కొన్నిరోజుల తర్వాత ముంబైలో ఓ మర్చిపోలేని ఓ సాయంత్రం.
𝗣𝗮𝘀𝘀𝗶𝗻𝗴 𝗼𝗻 𝘁𝗵𝗲 𝗯𝗮𝘁𝗼𝗻 𝘄𝗶𝘁𝗵 𝗰𝗹𝗮𝘀𝘀 & 𝗴𝗿𝗮𝗰𝗲! 📝
To,
Gautam Gambhir ✉From,
Rahul Dravid 🔊#TeamIndia | #SLvIND | @GautamGambhir pic.twitter.com/k33X5GKHm0— BCCI (@BCCI) July 27, 2024
అన్నికంటే ముఖ్యంగా కోచ్‌గా పదవికాలంలో నేను ఎన్నో జ్ఞాపకాలు పోగు చేసుకున్నా. జట్టు సభ్యుల స్నేహాన్ని సంపాదించాను. భారత కోచ్‌గా పగ్గాలు అందుకున్న వేళ.. నీకు కూడా ఇదే తరహా అనుభవం కలగాలని కోరుకుంటున్నా. అంతేకాదు ప్రతి ఫార్మాట్లో ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లు నీకు అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నా. గుడ్ లక్. ఇంకా కొంచెం అదృష్టం కూడా తోడవ్వాలని కోరుకుంటున్నా.
𝗛𝗲𝗮𝗱 𝗖𝗼𝗮𝗰𝗵 𝗚𝗮𝘂𝘁𝗮𝗺 𝗚𝗮𝗺𝗯𝗵𝗶𝗿 𝗧𝗮𝗸𝗲𝘀 𝗖𝗵𝗮𝗿𝗴𝗲! 💪#TeamIndia | #SLvIND | @GautamGambhir pic.twitter.com/sbG7VLfXGc
— BCCI (@BCCI) July 23, 2024
జట్టు సభ్యులతో పాటు కోచ్‌లుగా మనం కూడా ఎంతో కొంచెం తెలివిగా, స్మార్ట్‌గా ఉండాలి. మైదానంలో నువ్వు ఆటగాళ్లకు అదే తరహాలో శిక్షణ ఇవ్వడం చూశాను. నీ బ్యాటింగ్ భాగస్వామిగా, సహచర ఫీల్డర్‌గా నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటావో తెలుసు. అంతేకాదు ఓటమిని ఒప్పుకునేందుకు అస్సలు ఇష్టపడవు. ఐపీఎల్ సీజన్లోనూ నీలో గెలవాలనే కసిని చూశాను. ఆఖర్లో ఒక మాట.. కోచ్‌గా నీకు కష్టమైన సందర్భాలు ఎదురుకావొచ్చు. అప్పుడు బిగ్గరగా శ్వాస వదులు. ఒక అడుగు వెనక్కి వేయి. అయినా ఆ పరిస్థతి ఇంకా కష్టంగా ఉంటే ఓ నవ్వు విసురు. ఆ తర్వాత జరుగబోయేది అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. నువు విజయవంతం కావాలని కోరుకుంటున్నా గౌతమ్. నువ్వు భారత జట్టును మరిన్ని శిఖరాలకు తీసుకెళ్తావనే నమ్మకం నాకుంది అని గౌతీకి ద్రవిడ్ సుదీర్ఘ సందేశం పంపాడు.ఆ మెసేజ్ విన్న గంభీర్ ఎమోషనల్ అయ్యాడు.
🆙 Next 👉 Sri Lanka 🇱🇰#TeamIndia are back in action with 3 ODIs and 3 T20Is#INDvSL pic.twitter.com/aRqQqxjjV0
— BCCI (@BCCI) July 18, 2024
గంభీర్ హెడ్‌కోచ్‌గా, సూర్యకుమార్ కెప్టెన్‌గా భారత జట్టు తొలి సిరీస్ ఆడుతోంది. టీ20, వన్డే సిరీస్ కోసం లంకలో అడుగుపెట్టిన టీమిండియా జూన్ 27 శనివారం తొలి టీ20లో ఆతిథ్య జట్టుతో తలపడనుంది. పల్లెకెలె స్టేడియంలో రాత్రి 730 గంటలకు మ్యాచ్ షూరూ కానుంది. అనంతరం ఆగస్టు 2న వన్డే సిరీస్ ఆరంభమవుతుంది.