Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024) లో షూటింగ్ (Shooting) 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ (10 M Air Rifle Mixed Team) ఈవెంట్లో భారత్‌కు నిరాశే ఎదురైంది. ఈ ఈవెంట్లో రమితా జిందాల్ (Ramita Jindal)-అర్జున్ బబుతా (Arjun Babuta ), ఎలావెనిల్ వేలారివన్ (Elavenil Valarivan)-సందీప్ సింగ్ (Sandeep Singh) జోడీలకు క్వాలిఫికేషన్ రౌండ్లోనే చేదు అనుభవం ఎదురైంది. ఈ రెండు జోడీలు మెడల్ రౌండ్స్‌కు అర్హత సాధించలేకపోయాయి.
రమితా జిందాల్ (Ramita Jindal)-అర్జున్ బబుతా (Arjun Babuta ) జోడి క్వాలిఫికేషన్ రౌండ్లో ఆరో స్థానంతో సరిపెట్టుకోగా, ఎలావెనిల్ వేలారివన్ (Elavenil Valarivan)-సందీప్ సింగ్ (Sandeep Singh) జోడీ 12వ స్థానానికి పరిమితమైంది. దాంతో రెండు భారత జోడీలు మెడల్ రౌండ్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యాయి. రమిత-అర్జున్ జోడీ 628.7 పాయిట్లు సాధించగా.. ఎలావెనిల్-సందీప్ సింగ్ జోడీ 626.3 పాయింట్లు స్కోర్ చేసింది.