KL Rahul | సహజసిద్ధమైన ఆట ఆడాలని, అతిగా ఆలోచించొద్దని కేఎల్ రాహుల్‌కు టీం ఇండియా మాజీ సారధి కృష్ణమాచారి శ్రీకాంత్ సూచించాడు. త్వరలో జరుగనున్న టీ-20 వరల్డ్ కప్‌లో ఆడేందుకు ఎంపిక చేసిన టీం ఇండియా జట్టులో కేఎల్ రాహుల్‌కు చోటు దక్కింది. ఈ నేపథ్యంలో రాహుల్‌కు కృష్ణమాచారి శ్రీకాంత్ చేసిన సూచనకు ప్రాధాన్యం ఏర్పడింది.
టీ-20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన టీంలో మహమ్మద్ షమీ ఉండాల్సిందని కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. హర్షల్‌పటేల్ స్థానంలో షమీ ఉండాల్సింది. తమ దృష్టిలో షమీ లేడని బీసీసీఐ సెలక్షన్ కమిటీ చెప్పడమేమిటో నాకైతే తెలియదు` అని వ్యాఖ్యానించారు. టీ-20 వరల్డ్ కప్‌కు మహమ్మద్ షమీని స్టాండ్‌బై ప్లేయర్‌గా బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.