Team India Coach | టీమిండియా కోచ్ పదవికి ఉండాల్సిన అర్హతలేంటో తెలుసా?
Team India Coach | ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానుల మధ్య జరుగుతున్న చర్చలు రెండు విషయాల గురించే. ఒకటి టీ20 ప్రపంచకప్, రెండోది ఈ టోర్నీ తర్వాత జట్టులో జరిగే మార్పులు.

ముంబై: ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానుల మధ్య జరుగుతున్న చర్చలు రెండు విషయాల గురించే. ఒకటి టీ20 ప్రపంచకప్, రెండోది ఈ టోర్నీ తర్వాత జట్టులో జరిగే మార్పులు. ఈ ప్రపంచకప్ తర్వాత జట్టు కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా తదుపరి కోచ్ ఎవరనే విషయంపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.
అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, రికీ పాంటింగ్, మహేల జయవర్దనే తదితరుల పేర్లు ఈ పదవి కోసం వినిపించాయి. ఈ క్రమంలో తాజాగా ఆదివారం నాడు టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. దానిలో కోచ్ పదవికి దరఖాస్తు చేసే వారికి ఉండాల్సిన అర్హతలను కూడా పేర్కొంది.
ఈ ప్రకటన ప్రకారం టీమిండియా కోచ్ అవ్వాలనుకునే వ్యక్తి వయసు 60 ఏళ్లకు మించకూడదు. అలాగే సదరు అభ్యర్థి కనీసం 30 టెస్టులు లేదా 50 వన్డే మ్యాచులు ఆడిన అనుభవం కలిగి ఉండాలి. లేదంటే ఏదైనా టెస్టు క్రికెట్ ఆడే దేశపు జట్టుకు రెండేళ్లపాటు కోచ్గా పనిచేసి ఉండాలి.
అంతేకాదు ఐసీసీ అసోసియేట్ సభ్య దేశం లేదా ఐపీఎల్ జట్టు లేదా డొమెస్టిక్ జట్టుకు మూడేళ్ల పాటు కోచ్గా బాధ్యతలు నిర్వర్తించిన వారు కూడా టీమిండియా కోచ్ పదవికి అర్హులే. లేదంటే బీసీసీఐ అందించే లెవెల్ 3 లేక దానితో సమానమైన ధ్రువీకరణ ఉన్న వారు కూడా టీమిండియా కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

