మంగళవారం 19 జనవరి 2021
Sports - Jan 03, 2021 , 14:45:22

రూల్స్ పాటించ‌క‌పోతే రాకండి: ఆస్ట్రేలియా మంత్రులు

రూల్స్ పాటించ‌క‌పోతే రాకండి: ఆస్ట్రేలియా మంత్రులు

మెల్‌బోర్న్‌: ఇండియా, ఆస్ట్రేలియా మ‌ధ్య బ్రిస్బేన్‌లో నాలుగో టెస్ట్ జ‌రుగుతుందా లేదా అన్న సందేహాల నేప‌థ్యంలో అక్క‌డి క్వీన్స్‌ల్యాండ్ మంత్రులు ఇండియ‌న్ టీమ్‌కు మింగుడు ప‌డ‌ని వ్యాఖ్య‌లు చేశారు. క్వారంటైన్ నిబంధ‌న‌లు పాటించ‌డం ఇష్టం లేక‌పోతే అస‌లు త‌మ రాష్ట్రానికి రావాల్సిన అవ‌స‌రం లేద‌ని క్వీన్స్‌ల్యాండ్ ఆరోగ్య‌శాఖ మంత్రి రోస్ బేట్స్ అన‌డం గ‌మ‌నార్హం. క్వీన్స్‌ల్యాండ్‌లో క‌ఠిన క్వారంటైన్ నిబంధ‌న‌ల‌పై టీమిండియా అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే సుమారు నెల రోజుల వ‌ర‌కు త‌మ టీమ్ క్వారంటైన్‌లో ఉన్న‌ద‌ని, ఇక త‌మ వ‌ల్ల కాద‌ని టీమిండియా తేల్చి చెప్పింది. 

అలా అయితే మీరు రావాల్సిన అవ‌స‌ర‌మే లేద‌ని క్వీన్స్‌ల్యాండ్ మంత్రి అన‌డం నాలుగో టెస్ట్‌పై మ‌రిన్ని సందేహాలు వ్య‌క్త‌మ‌య్యేలా చేస్తున్నాయి. ఆరోగ్య మంత్రే కాదు అక్క‌డి క్రీడా శాఖ మంత్రి టిమ్ మాండెర్ కూడా ఇలాంటి వ్యాఖ్య‌లే చేశారు. బ్రిస్బేన్‌లో నాలుగో టెస్ట్ ఆడ‌టానికి వ‌చ్చే టీమిండియా క్వారంటైన్ నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతే.. వాళ్లు ఇక్క‌డికి రావాల్సిన ప‌నే లేదు అని మాండెర్ అన్నారు. రూల్స్ అంద‌రికీ ఒకేలా ఉంటాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇవి కూడా చ‌ద‌వండి

కొవిషీల్డ్ వ‌ర్సెస్ కొవాగ్జిన్‌.. ఏ వ్యాక్సిన్ ధర ఎంత‌?

వ్యాక్సిన్ వ‌చ్చేసింది.. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ల‌కు డీసీజీఐ అనుమ‌తి

ఇండియా, ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ డౌటే!

దర్శక నిర్మాతలకు థియేటర్లపై ఇంకా నమ్మకం కుదరలేదా..?