FIDE World Cup : భారత చెస్ సంచలనం దివ్య దేశ్‌ముఖ్ (Divya Deshmukh) రికార్డు సృష్టించింది. రెండు రోజులుగా ఉత్కంఠ రేపుతున్న ఫిడే మహిళల వరల్డ్ కప్ (FIDE Womens World Cup)లో ఛాంపియన్‌గా అవతరించింది. రెండుసార్లు వరల్డ్ విన్నర్ కోనేరు హంపిని ఓడించి విజేతగా నిలిచిందీ యవకెరటం. భారత 88వ గ్రాండ్‌మాస్టర్‌గా హోదాను సొంతం చేసుకుంది దివ్య. అంతేకాదు వచ్చే ఏడాది టోర్నీకి అర్హత కూడా సాధించింది.
జార్జియా వేదికగా జరిగిన ఫిడే మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో హంపి, దివ్య హోరాహోరీగా తలపడ్డారు. తనకంటే సీనియర్ అయిన తెలుగు తేజానికి 19 ఏళ్ల దివ్య గట్టి పోటీనిచ్చింది. ఈ మెగా టోర్నీ ఫైనల్లో తొలి రెండు మ్యాచ్‌లను డ్రాగా ముగించారిద్దరూ. దాంతో, ట్రై బ్రేకర్ అనివార్యమైంది. ఈ రౌండ్లో వ్యూహాత్యక ఆటతో హంపిని మట్టికరిపించి టైటిల్ ఎగరేసుకుపోయింది దివ్య. ట్రోఫీతో పాటు రూ.43 లక్షల నగదు బహుమతి గెలుచుకుంది మహరాష్ట్ర ప్లేయర్. రన్నరప్ హంపి రూ.26 లక్షలు అందుకుంది.
🚨BREAKING: 🇮🇳 Divya Deshmukh becomes India’s 88th Grandmaster and conquers the FIDE Women’s World Cup – a double crown for the rising queen of Indian chess! ♟️👑 📸 @FIDE_chess pic.twitter.com/m6EEfBSDCG
— Chess.com – India (@chesscom_in) July 28, 2025
‘భారత చెస్‌లో ఇది చరిత్రాత్మకమైన రోజు. మన దేశం నుంచి మరొక గ్రాండ్‌మాస్టర్ పుట్టుకొచ్చింది. ఫిడే మహిళల వరల్డ్ కప్‌లో విజయం దివ్య ఆత్మవిశ్వాసాన్ని రెండింతలు చేయనుంది. ఈ అద్భుత క్షణాలను ఆమెకు జీవితాంతం గుర్తుంటాయి. ఈ విక్టరీ దివ్యను భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించేందుకు దోహదపడుతుంది’ అని ఐదుసార్లు ఛాంపియన్ ఆనంద్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
🤩 @vishy64theking‘s thoughts on @DivyaDeshmukh05‘s victory! @FIDE_chess pic.twitter.com/3nT45z6Mnt
— Chess.com – India (@chesscom_in) July 28, 2025