Divya Deshmukh : ఫిడే మహిళల వరల్డ్ కప్ ఛాంపియన్‌గా అవతరించిన దివ్య దేశ్‌ముఖ్ (Divya Deshmukh) పేరు ప్రస్తుతం దేశమంతా మార్మోగిపోతోంది. 19 ఏళ్లకే భారత గ్రాండ్‌మాస్టర్‌గా రికార్డు సృష్టించిన దివ్య.. టీనేజ్ నుంచే సంచలన విజయాలకే కేరాఫ్. చిన్న వయసు నుంచే చదరంగంలో అబ్బురపరుస్తున్న తను ఇప్పుడు ఏకంగా వరల్డ్ ఛాంపిన్గా యావత్ దేశం గర్వపడేలా చేసింది. మనదేశం నుంచి 88వ గ్రాండ్‌మాస్టర్ ట్యాగ్ సొంతం చేసుకుంది. అందంతోనే కాదు.. ఆటతోనూ అందర్నీ ఫిదా చేస్తున్న ఈ యంగ్ బ్యూటీ విశేషాలివి.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ దివ్య సొంతూరు. ఆమె తల్లిదండ్రులు జితేంద్ర దేశ్‌ముఖ్(Jitendra Deshmukh) , నమ్రతా దేశ్‌ముఖ్ (Namrata Deshmukh) ఇద్దరూ డాక్టర్లే. దాంతో.. పెద్దయ్యాక తను కూడా వైద్యురాలిగా స్థిరపడాలనకుంది దివ్య. అయితే.. తానొకటి తలిస్తే విధి మరొకటి తలచినట్టు అనుకోకుండా చదరంగం వైపు ఆమె అడుగులు పడ్డాయి. భవాన్స్ భగవాన్‌దాస్ పురోహిత్ విద్యా మందిర్‌లో దివ్య జీవితంలో టర్నింగ్ పాయింట్. అక్కడే ఆమె చెస్ మీద ఆసక్తి పెంచుకుంది.
Divya Deshmukh, the Winner of the 2025 FIDE Women’s World Cup.
Through this victory she also achieves Grandmaster status.
At the age of 19.
And behind the Grandmaster is the caring mother…As always, the unsung hero behind many stars…
— anand mahindra (@anandmahindra) July 28, 2025
‘నేను అనుకోకుండా చెస్ ఆటను ఎంచుకున్నా. అప్పుడు నాకు నాలుగేళ్లు. మా సోదరి ఆర్య రోజూ బ్యాడ్మింటన్ క్లాస్‌లకు వెళ్లేది. ఒకరోజు అమ్మానాన్న నన్ను కూడా అక్కడికి తీసుకెళ్లారు. కానీ, నా ఎత్తు నెట్ వరకూ కూడా సరిపోలేదు. అదే భవనంలో చెస్ క్లాస్‌లు జరుగుతున్నాయి. దాంతో.. నన్ను కాసేపు అక్కడికి మా పేరంట్స్ తీసుకెళ్లడంతో ఆ ఆటనే నాకు సర్వస్వం అనుకున్నా. ఆ రోజు నుంచి చదరంగంతో ప్రేమలో పడిపోయాను. అమ్మానాన్న ప్రోత్సాహం కూడా నా అభిరుచికి సానబెట్టుకోవడంలో ఎంతో తోడ్పడింది’ అని ఒకానొక సందర్భంలో దివ్య వెల్లడించింది.
చిన్న వయసు నుంచే ప్రకంపనలు సృష్టించడం తన నైజంగా మార్చుకుంది దివ్య. ఏడేళ్ల వయసులోనే నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో విజయంతో అందరి దృష్టిలో పడింది దివ్య. 2021లో ఉమెన్ గ్రాండ్‌మాస్టర్ టైటిల్ గెలుపొందిన ఆమె.. అదే ఏడాది ఇంటర్నేషనల్ మాస్టర్స్ విజేతగా నిలిచింది. అదే జోరు చూపిస్తూ.. 2022లో ఇండియన్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ కైవసం చేసుకున్న దివ్య.. బోర్డు ముందు ప్రశాంతంగా ఉంటూనే వ్యూహాత్మక ఆటతో ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా మారింది. ఈ ఏడాది ‘ఫిడే చెస్ ఒలింపియాడ్’లో భారత బృందం విజయంలో కీలక పాత్ర పోషించిందీ యంగ్‌స్టర్.
THE ONLY INDIAN TO WIN THE WORLD CUP – VISHWANATHAN ANAND (2000 & 2002)
THE ONLY INDIAN TO WIN THE WOMEN’S WORLD CUP – DIVYA DESHMUKH (2025) pic.twitter.com/dZiAB98QPZ
— Utsav 💙 (@utsav__45) July 28, 2025
ఫిడే మహిళల వరల్డ్ కప్‌లో తన హవా కొనసాగించిన ఈ యువకెరటం ఫైనల్‌కు దూసుకెళ్లింది. టైటిల్ పోరులో రెండుసార్లు ఛాంపియన్ కోనేరు హంపి(Koneru Hampi)ని మట్టికరిపించింది దివ్య. రెండు డ్రాలు.. ఆపై ట్రై బ్రేకర్‌లో హంపిని ఓడించి .. భారత 88వ గ్రాండ్‌మాస్టర్‌గా రికార్డు నెలకొల్పింది. మొత్తంగా మనదేశం నుంచి ఈ ఘనత సాధించిన నాలుగో మహిళగా గుర్తింపు తెచ్చుకుందీ అందాల యువరాణి. టోర్నమెంట్లు లేనప్పుడు ఇంటిపట్టునే ఉండడం తనకెంతో ఇష్టమంటుంది దివ్య. కొత్త ప్రదేశాల్లో విహరించడంతో పాటు చరిత్ర, సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు చదవడం తన హాబీలు.
🇮🇳 Divya Deshmukh defeats Humpy Koneru 🇮🇳 to win the 2025 FIDE Women’s World Cup 🏆#FIDEWorldCup @DivyaDeshmukh05 pic.twitter.com/KzO2MlC0FC
— International Chess Federation (@FIDE_chess) July 28, 2025