యాచారం, జూలై28: విద్యార్థులకు ఉత్తమ భోదనతో పాటు నాణ్యమైన బోజనం అందించాలని ఎంపీడీవో రాధారాణి అన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సోమవారం ఆమె తనిఖీ చేశారు. విద్యార్థుల తరగతి గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, మంచినీరు, తాగునీరు వసతి, విద్యార్థులకు వడ్డించే అన్నం, కూరలను పరిశీలించారు. వసతి గృహంలో నెలకొన్న సమస్యలను స్వయంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..వసతి గృహంలో విద్యార్థులకు కనీస మౌలిక వసతులను కల్పించాలని సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. వసతి గృహంలో పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని పేర్కొన్నారు. హస్టల్లో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.