Open School | జగిత్యాల : జగిత్యాల జిల్లాలో ఓపెన్ స్కూల్ కు సంబంధించిన అడ్మిషన్లు ప్రారంభమైనట్టుగా దానికి సంబంధించిన రాష్ట్ర స్థాయి పోస్టర్ను జిల్లా విద్యాధికారి రాము సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న చదువు మానేసిన విద్యార్థులు పదో తరగతి గానీ లేకుంటే ఇంటర్మీడియట్ లో గాని పాస్ అవ్వడానికి ఇదొక మంచి అవకాశమని సూచించారు.
వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జిల్లాలో చదువు మానేసిన విద్యార్థులకు తెలియజేశారు. ఓపెన్ టెన్త్, ఇంటర్ కి సంబంధించిన అడ్మిషన్లు వచ్చేనెల ఆగస్టు 28వరకు అవకాశం ఉందని డీఈవో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ సూర్య ప్రకాష్, ఎస్వో సత్యనారాయణ, ఓల్డ్ హైస్కూల్ కోఆర్డినేటర్ బీ శ్రీనివాస్ పాల్గొన్నారు.