IPL 2025 : ఐపీఎల్లో మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)కి ఉన్న క్రేజ్ మామూలు కాదు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదు ట్రోఫీలు కట్టబెట్టిన ఈ దిగ్గజ ప్లేయర్ ఆట చూసేందుకు అభిమానులు స్టేడియాలకు పోటెత్తుతారు. అలాంటి మహీ భాయ్ మైదానంలో చెలరేగడం చూసేందుకు ఈసారి ప్రత్యేక అతిథులు వచ్చారు. వాళ్లు ఎవరో తెలుసా.. అతడి తల్లిదండ్రులు.
చెపాక్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్కే మ్యాచ్‌ను మహీ అమ్మానాన్నలు పాన్ సింగ్ ధోనీ, దేవికా దేవీలు వీక్షిస్తున్నారు. దిగ్గజ క్రికెటర్ అయిన తమ కుమారుడి వికెట్ కీపింగ్, బ్యాటింగ్ నైపుణ్యాలను కళ్లారా ఆస్వాదిస్తున్నారు. ఇక ఈ జార్ఘండ్ డైనమైట్ కూతురు జీవా(Ziva) అయితే.. నాన్న ఆటను చూస్తూ.. విజిల్ ఊదుతూ తెగ మురిసిపోతోంది.
MS Dhoni’s parents are Watching the match, for the first time ever I have seen them I’m limelight 🫡
Bro I can’t digest Retirement trauma of Dhoni if it happens 🥲#CSKvDC pic.twitter.com/TB7Q9pav7X
— Utkarsh 🇮🇳🇮🇱 (@utkarsh_dhoni) April 5, 2025
ఐపీఎల్ సీజన్ మొదలై 18 ఏళ్లు కావొస్తున్నా.. ధోనీ పేరంట్స్ మాత్రం స్టేడియంలో కనిపించిన సందర్భాలు చాలా అరుదు. కానీ, చెపాక్‌లో వాళ్లు ప్రత్యక్షం కావడంతో బహుశా ధోనీకి ఇదే ఆఖరి మ్యాచా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. తాలాకు ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కావచ్చు. అందుకే కాబోలు అతడి అమ్మానాన్నలు స్టేడియానికి వచ్చి మరీ మ్యాచ్ చూస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు మరికొందరు అభిమానులు.
MS Dhoni might announce retirement from IPL Today !!
Seems like Critisism and trolls took a heavy toll.#DhoniRetirement#MSDhoni #CSKvsDC #DCvsCSK pic.twitter.com/VCFqZiQEyy— Shivam Verma (@Shivam_Verma_98) April 5, 2025
రైల్వే టికెట్ కలెక్టర్‌గా పనిచేస్తూనే.. క్రికెటర్‌గా మెరుగైన ధోనీ టీమిండియాకు ఎంపికైన కొత్తలో తన పొడవైన జులపాల జుట్టుతో అలరించాడు. కెప్టెన్సీ చేపట్టిన అతడు భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. ఇక ఐపీఎల్‌లోనూ సీఎస్కేను ఐదు పర్యాయాలు ఛాంపియన్‌గా నిలిపాడు మహీ.