RRR | టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ తో ఏకంగా ఆస్కార్ అవార్డు ని కూడా సాధించి చరిత్ర సృష్టించారు. ఈ సినిమాతో హాలీవుడ్ లో కూడా మన సినిమాలపై ఆసక్తి కలిగింది. అయితే సాధారణంగా ఇద్దరు టాప్ హీరోలు ఇటీవలి కాలంలో కలిసి ఒకే తెరపై సందడి చేయడం అసాధ్యం. కాని ఆర్ఆర్ఆర్ చిత్రంతో దాన్ని సుసాధ్యం చేశాడు రాజమౌళి.
ఇక ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ సమయంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు కలిసి అనేక ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. చాలా క్లోజ్ గా ఉంటూ ఒకరికి సంబంధించిన విషయాలు ఒకరు షేర్ చేసుకుంటూ తెగ సందడి చేశారు. ఇటీవలి కాలంలో ఈ ముగ్గురు మళ్లీ కలిసి కనిపించింది లేదు. కాని ఇప్పుడు ఈ ముగ్గురు స్టార్స్ మరోసారి కలిసి కనపడబోతున్నారు. లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో RRR సినిమాని ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా కీరవాణితో ఆర్ఆర్ఆర్ సాంగ్స్ ఆర్కెస్ట్రా కూడా నిర్వహించనున్నారు. మే 11న సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఈవెంట్ లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో జరగనుంది.
ఇక సినిమా ప్రదర్శించేముందు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో అక్కడి ఆడియన్స్ క్వశ్చన్ -ఆన్సర్స్ కార్యక్రమం కూడా ఉంటుందట. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి రాయల్ ఆల్బర్ట్ హాల్ సైట్ లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసారు. ఇంగ్లాండ్, లండన్ లో ఉండే ఫ్యాన్స్ ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకొని డైరెక్ట్ గా ఆ షోకి వెళ్లే అవకాశం ఉంది. చరణ్, ఎన్టీఆర్, రాజమౌళిలను లైవ్ లో చూసి వారితో మాట్లాడే ఛాన్స్ మీకు కూడా దక్కనుంది. ఇంకెందుకు మరి ఆలస్యం ఈ ఈవెంట్ టికెట్స్ ని https://www.royalalberthall.com/tickets/events/2025/rrr-live ఈ లింక్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.