ICC : భారత క్రికెట్లో గొప్ప కెప్టెన్‌గా కితాబులందుకున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)కి మరో గౌరవం లభించింది. దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మహీ భాయ్‌కు ‘ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్’లో చోటు లభించింది. అతడితోపాటు అంతర్జాతీయ క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన మరో ఆరుగురు కూడా ఈ జాబితాలో ఉన్నారు. సోమవారం ఐసీసీ సెలెక్ట్ చేసిన వాళ్లలో ఐదుగురు పురుష క్రికెటర్లు, ఇద్దరు మహిళా క్రికెటర్లను ఆల్ ఆఫ్ ఫేమ్‌కు ఎంపిక చేసింది.
Unorthodox, unconventional and effective 🙌
A cricketer beyond numbers and statistics 👏
MS Dhoni is inducted in the ICC Hall of Fame 🥇
More ➡️ https://t.co/oV8mFaBfze pic.twitter.com/AGRzL0aP79
— ICC (@ICC) June 9, 2025
ధోనీ సారథ్యలో భారత జట్టు 2007 టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. అనంతరం సొంతగడ్డపై 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఛాంపియన్‌గా అవతరిచింది. ధోనీతో పాటు ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నవాళ్లలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్(Mathew Hayden), దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్, మిడిలార్డర్ బ్యాటర్ హషీం అమ్లా, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డానియల్ వెటోరీ (Daniel Vettori) లు ఉన్నారు.
Titles and accolades for England across the globe 🏴
One of the finest wicket-keepers to have played the game 👏
Sarah Taylor enters the ICC Hall of Fame 🥇
More ➡️: https://t.co/0wQuwvwdt9 pic.twitter.com/KYgfdzZSs7
— ICC (@ICC) June 9, 2025
మహిళా క్రికెట్లో అంతర్జాతీయంగా రాణించిన ఇంగ్లండ్ వికెట్ కీపర్, బ్యాటర్ అయిన సారా టేలర్(Sarah Taylor), పాకిస్థాన్ మహిళా క్రికెటర్ సనా మిర్ (Sana Mir) లు ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్‌లో ఉన్నారు.
పాక్ తరఫున ఈ గౌరవం అందుకున్న తొలి మహిళ సనానే కావడం విశేషం.