Shikhar Dhawan : అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ఈమధ్యే ఇంటర్నెట్లో వైరల్ అయ్యాడు. ‘నిద్ర పట్టడం లేదు సాయం చేయండం’టూ రాత్రి 10:30 గంటలకు అతడు పెట్టిన పోస్ట్ అభిమానులను ఒకింత కలవరపెట్టింది. భార్యతో విడాకుల తర్వాత ఒంటరి జీవితం కారణంగానే ధావన్ ఆ పోస్ట్ చేసి ఉంటాడులే అని అనుకున్నారంతా. ఇప్పుడు మళ్లీ ధావన్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే.. సోమవారం ముంబై విమానాశ్రయానికి వచ్చిన ధావన్‌ను కెమెరావాళ్ల కంట్లో పడ్డాడు. ఇంకేముంది.. కెమెరాలన్నీ అతడివైపే తిరిగాయి. అంతలోనే ఓ మహిళా ధావన్ వచ్చిన కారులోంచి దిగింది. అయితే.. టీషర్ట్, కళ్లద్దాలతో తళుక్కుమన్న ఆ విదేశీ వనిత ఎవరికీ అనుమానం రాకుండా కొంచెం పక్కకు వెళ్లి నిల్చొంది.
ధావన్ కూడా ఏమీ తెలియనట్టుగా యాక్ట్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి విమానాశ్రయం లోపలికి వెళ్లారు. అంతే.. వాళ్లిద్దరి ఎయిర్‌పోర్టు వీడియో రెప్పపాటులో వైరల్ అయింది. ఆ వీడియో చూసినవాళ్లంతా గబ్బర్ మళ్లీ కొత్త వలపు జీవితం మొదలుపెడుతున్నాడా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఆ సదరు మహిళ ఎవరనేది మాత్రం తెలియలేదు.
టీమిండియా తరఫున విజయవంతమైన ఓపెనర్లలో ధావన్ ఒకడు. రోహిత్ శర్మకు జోడీగా ఈ లెఫ్ట్ హ్యాండర్ ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడాడు. హిట్‌మ్యాన్ జతగా 2012 నుంచి 2021 మధ్య 115 ఇన్నింగ్స్‌లో 5,148 పరుగులు జోడించాడు. అయితే.. శుభ్‌మన్ గిల్ (Shubman Gill) దూసుకు రావడంతో అతడి స్థానానికి ఎసరొచ్చింది.
స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లలో గిల్, రోహిత్ ద్వయం బాగా హిట్ అయింది. దాంతో, ఇక ధావన్ అవసరం లేకపోయింది. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేసిన ధావన్ ఈమధ్యే ముగిసిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ (Legneds League Cricket)లో మెరిశాడు.
తన స్టయిలిష్ ఆటతో రికార్డులు నెలకొల్పిన ధావన్.. 2012 అక్టోబర్‌లో అయేషా ముఖర్జీని పెండ్లి చేసుకున్నాడు. అప్పటికే మొదటి భర్తతో విడిపోయిన ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే 9 ఏండ్ల తర్వాత దాంపత్య జీవితం తర్వాత ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారు. అయేషా 2021లో సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ధావన్‌తో విడాకుల విషయాన్ని వెల్లడించింది. ఈమధ్యే ఫ్యామిలీ కోర్టు ఇద్దరికీ విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం అయేషా ఆస్ట్రేలియాలో ఉంటోంది. వీళ్ల కుమారుడు జొరావర్ కూడా ఆమెతో పాటు అక్కడే ఉంటున్నాడు.