Yuzvendra Chahal | టీమ్ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ (Dhanashree Verma) వివాహ బంధానికి తెరపడింది. వీరికి ముంబైలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ మేరకు ఇవాళ తుది తీర్పు వెలువరించింది.
#WATCH | Mumbai: On the divorce of Cricketer Yuzvendra Chahal and Dhanashree Verma, Advocate Nitin Kumar Gupta, representing Chahal, says, “The court has granted the decree of divorce. The court has accepted the joint petition of both parties. The parties are no longer husband… pic.twitter.com/LV1BpFwxIN
— ANI (@ANI) March 20, 2025
వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. 2022 నుంచే ఈ ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో 2025 ఫిబ్రవరి 5న ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం ఇద్దరూ దరఖాస్తు చేసుకున్నారు. ఇక పరస్పర అంగీకారంతో ఈ జంట విడాకులు తీసుకోవాలని కోరుకుంటున్న నేపథ్యంలో ఆరు నెలల కూలింగ్ పీరియడ్‌ను మినహాయించాలని ఫ్యామిలీ కోర్టును అభ్యర్థించగా అందుకు న్యాయస్థానం ఒప్పుకోలేదు. దీనిని సవాల్ చేస్తూ చాహల్ తరఫు న్యాయవాది హైకోర్టును (Bombay High Court) ఆశ్రయించగా అందుకు న్యాయస్థానం పిటీషన్‌దారుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. 2022 నుంచే విడివిడిగా ఉంటున్నందున మళ్లీ ఆరు నెలల కూలింగ్ పీరియడ్ అవసరం లేదని స్పష్టం చేసింది.
అంతేకాదు మార్చి 20 లోపు విడాకుల అంశంపై తుది తీర్పు ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో చాహల్ – ధనశ్రీ జంటకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు గురువారం తుది తీర్పు వెలువరించింది. ధనశ్రీకి భరణం కింద రూ. 4.75 కోట్లు ఇచ్చేందుకు చాహల్ ఇప్పటికే అంగీకరించారు. ఈ మొత్తంలో ఇందులో రూ. 2.37 కోట్లు చెల్లించాడు కూడా.
కాగా, దంత వైద్యురాలైన ధనశ్రీ వర్మను 2020 డిసెంబర్ 22న చాహల్ పెండ్లి చేసుకున్నారు. కొరియోగ్రాఫర్‌గా, సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ధనశ్రీ. పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉన్నారు. అయితే, ఇటీవలే ధనశ్రీ తన పేరు నుంచి ‘చాహల్’ నేమ్‌ను తీసేయడంతో పాటు ఫొటోలను కూడా సోషల్ మీడియా నుంచి తొలగించింది. దీంతో ఈ జంట విడాకులు తీసుకోబోతోందంటూ పుకార్లు వ్యాపించాయి. ఆ తర్వాత చాహల్ సైతం ‘న్యూ లైఫ్ లోడెడ్’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. దీంతో వీరు విడాకులు తీసుకోవడం ఖాయం అని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే వీరు తమ సోషల్ మీడియా ఖాతాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, ఇద్దరూ తమ సోషల్‌మీడియా అకౌంట్లలో తమదైన శైలిలో పోస్టులు పెట్టడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యంపోసినట్లైంది.
Also Read..
“RJ Mahvash | చాహల్, ధనశ్రీ విడాకుల వేళ.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన మహ్వశ్”
“Dhanashree Verma | మహిళలను నిందించడం ఫ్యాషనైపోయింది.. ధనశ్రీవర్మ పోస్ట్ వైరల్”