Devon Conway : న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే టెస్టుల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. వరుసగా రెండు సంవత్సరాలు టెస్టుల్లో మొదటి సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. 2022 జనవరి1న కాన్వే శతకం బాదాడు. ఈ ఏడాది కూడా టెస్టులో మొదటి సెంచరీ తనే చేశాడు. పాకిస్థాన్‌తో కరాచీలో జరుగుతున్న రెండో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కాన్వే 121 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. 2022లో జనవరి 1వ తేదీన బంగ్లాదేశ్ మీద కాన్వే 122 పరుగులు చేశాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టెస్టుల్లో కాన్వేకు ఇది నాలుగో సెంచరీ. కాన్వే శతకంతో చెలరేగడంతో న్యూజిలాండ్ మొదటి రోజు 6 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. దాంతో, ఇరుజట్లు ఈ మ్యాచ్‌లో గెలవాలనే కసితో ఉన్నాయి.
వికెట్ కీపర్, బ్యాటర్ అయిన కాన్వే పుట్టి పెరిగింది దక్షిణాఫ్రికాలో. 2017లో న్యూజిలాండ్‌కు షిఫ్ట్ అయ్యాడు. న్యూజిలాండ్ జట్టుకు ఆడుతున్న దక్షిణాఫ్రికాకు చెందిన రెండో ఆటగాడిగా కాన్వే గుర్తింపు సాధించాడు. 2021లో కివీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరడంలో, ట్రోఫీ గెలుపొందడలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతను 54 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. నిలకడగా పరుగులు సాధిస్తూ కాన్వే ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
Devon Conway – First Centurion in 2022 ✅
Devon Conway – First Centurion in 2023 ✅#DevonConway | #PAKvNZ pic.twitter.com/GPg9rqkaYI— CricTracker (@Cricketracker) January 2, 2023