ICC : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్'(Player Of The Month) నామినీస్ పేర్లను ప్రకటించింది. మహిళల, పురుషుల క్రికెట్లో డిసెంబర్ నెలలో అదరగొట్టిన ముగ్గురిని పేర్లను వెల్లడించింది. పురుషుల విభాగంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins), న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిఫ్స్(Glen Philiphs), బంగ్లాదేశ్ పేసర్ తైజుల్ ఇస్లాం(Taijul Islam) పోటీపడుతున్నారు. ఓటింగ్ అనంతరం ఈ ముగ్గురిలో విజేత ఎవరో ఐసీసీ ప్రకటించనుంది.
ఇక మహిళల విషయానికొస్తే.. ఇద్దరు భారత క్రికెటర్లు ఈ అవార్డు రేసులో నిలిచారు. మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్(Jemimah Rodrigues), స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(Deepti Sharma)ల మధ్య గట్టి పోటీ నెలకొంది. జింబాబ్వే బౌలర్ల ప్రీసియస్ మరంగే(Precious Marange) తొలిసారి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు బరిలో నిలిచింది.
A star of Zimbabwe’s Africa Regional Qualifier campaign for the #T20WorldCup, plus two of India’s best against Australia 📝
Fierce competition for Women’s Player of the Month for December!
More 👉 https://t.co/0PtU3csBvl pic.twitter.com/fPW6bb70hV
— ICC (@ICC) January 9, 2024
డిసెంబర్లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్, ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్టులో జెమీమా అదరగొట్టింది. ఆసీస్‌పై రెండు వన్డేల్లో 82, 44 పరుగులతో సత్తా చాటింది. బ్యాటుతో, బంతితో చెలరేగిన దీప్తి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించింది.
స్వదేశంలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కమిన్స్ అద్భుతంగా రాణించాడు. మెల్బోర్న్ టెస్టులో పది వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు. న్యూజిలాండ్‌తో డిసెంబర్లో జరిగిన టెస్టు సిరీస్‌లో తైజుల్ ఇస్లాం నిప్పులు చెరిగాడు. తొలి టెస్టులో ఆరు వికెట్లు తీసి బంగ్లా చారిత్రాత్మక విజయంలో భాగమయ్యాడు.
Three strong cases put forward for Men’s ICC Player of the Month for December 👀
More on the candidates 👉 https://t.co/N3Pjs13s1d pic.twitter.com/lWHtILZMyC
— ICC (@ICC) January 8, 2024
అంతకాదు రెండో టెస్టులో ఐదు వికెట్లతో టిమ్ సౌథీ సేనను హడలెత్తించాడు. అయితే.. రెండో టెస్టులో ఫిలిఫ్స్ ఐదు వికెట్లు తీయడమే కాకుండా 87 రన్స్ కొట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లోనూ 40 పరుగులతో జట్టును గెలపించాడు. దాంతో, కివీస్ 1-1తో సిరీస్ సమం చేసింది.