ఢిల్లీ : తమ రంజీ ట్రోఫీ కెరీర్లో ఢిల్లీ జట్టు దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. మంగళవారం ఆ జట్టు సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో తమకంటే తక్కువ ర్యాంకు కల్గిన, ఇంతవరకూ అపజయమన్నదే ఎరుగని జమ్ముకశ్మీర్ చేతిలో ఓటమిపాలైంది. రంజీలో 1960 నుంచి ఈ ఇరుజట్లు తలపడుతుండగా ఇప్పటిదాకా ఢిల్లీతో 43 మ్యాచ్‌లాడిన జమ్ముకశ్మీర్.. 37 మ్యాచ్‌లో ఓటమివైపే నిలిచింది.
కానీ ఆట ఆఖరి రోజు 124 (లక్ష్యం 179) పరుగుల ఛేదనకు వచ్చిన పర్యాటక జట్టు.. ఓపెనర్ ఇక్బాల్ (133 నాటౌట్) అద్భుత శతకంతో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఢిల్లీకి షాకిచ్చింది.