Harshit Rana | ముంబై: దేశవాళీలో నిలకడగా రాణిస్తున్న ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణా టెస్టులలో అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యాడు. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌ను ఇదివరకే 0-2తో కోల్పోయిన భారత జట్టు వాంఖడే వేదికగా శుక్రవారం నుంచి జరుగబోయే మూడో టెస్టులో ఈ యువ పేసర్‌ను ఆడించనున్నట్టు తెలుస్తోంది.
వాంఖడే టెస్టుకు ముందు రాణాను జట్టులో చేర్చడంతో బుమ్రాకు విశ్రాంతినిచ్చి అతడిని ఆడించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలని చూస్తున్న టీమ్ఇండియా.. సిరాజ్, ఆకాశ్‌తో పాటు రాణాను ఆడించాలని భావిస్తోంది.