Delhi Capitals : ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కీలక నిర్ణయం తీసుకుంది. ఏడేండ్లుగా హెడ్‌కోచ్‌గా సేవలందించిన ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్(Ricky Ponting)కు వీడ్కోలు పలికింది. పాంటింగ్‌తో సుదీర్ఘ బంధాన్ని తెగ తెంపులు చేసుకుంటున్నట్టు శనివారం ఢిల్లీ ఫ్రాంచైజీ యాజమాన్యం తెలిపింది. డియర్ రికీ.. హెడ్‌కోచ్‌గా నువ్వు మాకు దూరమైతుంటే ఆ బాధను మాటల్లో చెప్పలేకపోతున్నాం. థ్యాంక్యూ కోచ్ అని ఎక్స్ వేదికగా ఢిల్లీ మేనేజ్మెంట్ ఓ పోస్ట్ పెట్టింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కోచ్‌గా పాంటింగ్ సక్సెస్ అయ్యాడు. కానీ, ఆ జట్టు ట్రోఫీ కలను మాత్రం నిజం చేయలేకపోయాడు. 14వ ఎడిషన్‌లో ఢిల్లీ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన పాంటింగ్ .. ఆ తర్వాత భారత లెజెండ్ సౌరవ్ గంగూలీ()తో జట్టుకు దిశానిర్దేశనం చేశాడు. అయితే.. గత మూడు సీజన్లలో ఢిల్లీ కనీసం ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది.
After 7 seasons, Delhi Capitals has decided to part ways with Ricky Ponting.
It’s been a great journey, Coach! Thank you for everything 💙❤️ pic.twitter.com/dnIE5QY6ac
— Delhi Capitals (@DelhiCapitals) July 13, 2024
ఇక 16వ సీజన్లో మరీ చెత్త ఆటతో ఢిల్లీ అట్టడుగున నిలిచింది. పదిహేడో సీజన్లో రిషభ్ పంత్ కెప్టెన్సీలో అదరగొట్టినా ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. దాంతో, కోచ్‌ను మారిస్తేగానీ జట్టు రాత మరదనే ఆలోచనతో ఢిల్లీ మేనేజ్మెంట్ పాంటింగ్‌కు గుడ్ బై చెప్పేసిందని టాక్. ఆసీస్ మాజీ కెప్టెన్ అయిన పాంటింగ్ నిరుడు అమెరికా టీ20 లీగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. మేజర్ క్రికెట్ లీగ్ (MSL)లోవాషింగ్టన్ ఫ్రీడమ్ (Washington Freedom) జట్టుకు కోచ్‌గా పని చేస్తున్నాడు.