Tata Curvv – Curvv.ev | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) తన న్యూ ఎస్యూవీ కూపే (SUV Coupe).. టాటా కర్వ్ (Tata Curvv) ఆవిస్కరణకు ముహూర్తం ఖరారు చేసింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతోపాటు ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్తోనూ టాటా కర్వ్ (Tata Curvv) కారును వచ్చేనెల ఏడో తేదీన ఆవిష్కరించనున్నది. ప్రముఖ ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ (Citroen) బాసాల్ట్ (Basalt) మోడల్ కారుకు టాటా కర్వ్ (Tata Curvv) గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. టాటా నెక్సాన్ (Tata Nexon), టాటా హారియర్ (Tata Harrier) కార్ల మధ్య న్యూ ఎస్యూవీ కూపే టాటా కర్వ్ (Tata Curvv) నిలుస్తుంది. ఇప్పటికైతే ఈవీ వర్షన్ కారు మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ సాయంతో బ్రేక్ పెడల్ షిప్టర్లతో వస్తుందని తెలుస్తోంది.
టాటా కర్వ్ (Tata Currv) మూడు డ్రైవింగ్ మోడ్స్ లో ఆఫర్ చేస్తోంది. సిటీ, ఎకో, స్పోర్ట్ మోడ్స్‌లో వస్తోందీ కారు. ఇందులో టాటా నెక్సాన్.ఈవీ, టాటా పంచ్.ఈవీ కార్ల నుంచి డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే వాడతారు. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్ లెస్ చార్జర్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, సన్ రూఫ్, అడాస్ సిస్టమ్ తదితర ఫీచర్లు ఉంటాయని సమాచారం. టాటా ఆల్ట్రోజ్, టాటా నెక్సాన్ కార్లలో మాదిరిగా టాటా కర్వ్ (Tata Curvv) కారు కూడా 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్ తో వస్తుంది. టర్బో పెట్రోల్ ఇంజిన్ తో వస్తుందా? లేదా? అన్న సంగతి తెలియరాలేదు. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ / ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ గేర్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది.
టాటా మోటార్స్ తొలిసారి టాటా పంచ్.ఈవీ కారును ఈవీ మార్కెట్లో ఆవిష్కరించింది. టాటా పంచ్.ఈవీ తరహాలోనే టాటా కర్వ్.ఈవీ (Tata Curvv.ev) ఫౌండేషన్ ఉందని తెలుస్తోంది. సింగిల్ చార్జింగ్ చేస్తే సుమారు 500 కి.మీ దూరం ప్రయాణిస్తుందని సమాచారం. వెహికల్ టూ లోడ్ ఫంక్షనాలిటీ, బ్రేక్ రీజనరేషన్, డ్రైవింగ్, మోడ్స్, డీసీ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఎంజీ జడ్ఎస్ ఈవీ, బీవైడీ అట్టో3 తోపాటు త్వరలో ఆవిష్కరించనున్న హ్యుండాయ్ క్రెటా ఈవీ కార్లకు టాటా కర్వ్.ఈవీ (Tata Curvv.ev) గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.