CM Revanth Reddy | డ్రగ్స్ నిర్మూలనపై సీరియస్‌గా దృష్టి సారించాలి : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించాలి.. మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఎవరికి వారు సీరియస్‌గా దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జేఎన్టీయూలో స్టూడెంట్ వాలంటరీ పోలీసింగ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
CM Revanth Reddy | హైదరాబాద్ : డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించాలి.. మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఎవరికి వారు సీరియస్‌గా దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జేఎన్టీయూలో స్టూడెంట్ వాలంటరీ పోలీసింగ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
సమాజంలో ఉండే సమస్యలను మనమే గుర్తించి పరిష్కరించుకుంటే దుష్ఫలితాలను నివారించుకోవచ్చు అని సీఎం తెలిపారు. సమాజంలో పెడధోరణులకు టెక్నాలజీ కూడా ఓ కారణంగా మారింది. పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచితే చాలా సమస్యలను నివారించవచ్చు. కుటుంబ వ్యవస్థ విచిన్నం కావడమే చిన్నారుల మానసిక బలహీనతలను కారణం. చిన్నారుల మానసిక దృఢత్వానికి ఉమ్మడి కుటుంబం తోడ్పడుతుంది. పిల్లలను మానసికంగా సంసిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఇందు కోసం పిల్లలకు సోషల్ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్ నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు సీఎం.
పాఠశాలలు, కాలేజీల్లో సబ్జెక్ట్ నేర్పించడమే కాదు.. మోరల్ పోలీసింగ్ కూడా నేర్పించాలి. పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనించే వ్యవస్థ ఉండాలని నిర్వాహకులకు సూచించాం. స్కూళ్లు, కాలేజీల్లో ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అవసరం ఎంతో ఉంది. పోలీసులకు సమాచారం చేరవేసేలా వ్యవస్థను తయారు చేసుకుంటే.. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చవచ్చు. డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోను ఏర్పాటు చేసింది. డ్రగ్స్ పై ప్రభుత్వం యుద్ధమే ప్రకటించింది. మీ అన్నగా పిలుపునిస్తున్నా… డ్రగ్స్ నిర్మూలనకు సహకరించండి. ఉద్యమాల గడ్డ తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. అన్ని ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో కేరళ మాదిరిగా మోరల్ పోలీసింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా.
మోరల్ పోలీసింగ్‌తో అన్ని రకాల సమస్యలను పరిష్కరించొచ్చు అని రేవంత్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక స్టేడియం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్‌లో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రజాప్రతినిధి అనేది అత్యంత పవిత్రమైన బాధ్యత. సమస్యలకు భయపడి పారిపోవద్దు… నిలబడి సమస్యలపై పోరాడాలి. జీవితంలో ఫోకస్‌గా పనిచేయండి.. లక్ష్యాలను సాధిస్తారు. రోజుకు 16 గంటలు మీరు ఎంత ఫోకస్ గా పని చేస్తారో… అది మీ లక్ష్యాన్ని అంత చేరువ చేస్తుంది. మన జీవితం మన చేతుల్లోనే ఉంది… మన జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలో మన చేతుల్లోనే ఉంటుంది. గొప్ప వ్యక్తులు ఎవరూ గొప్ప కుటుంబాల నుంచి రాలేదు. ఎవరూ ఎవరికంటే తక్కువ కాదు అని రేవంత్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Gun Miss Fire | నార్సింగిలో తుపాకీ మిస్ ఫైర్.. బెడ్రూంలోకి దూసుకెళ్లిన బుల్లెట్
boianpalli vinod kumar | పార్టీ మారుతున్న వాళ్లను చూసి బాధపడక్కర్లేదు: బోయిన్పల్లి వినోద్‌కుమార్
షాద్‌నగర్ రియల్టర్ హత్య కేసులో ట్విస్ట్.. పెద్ద కొడుకే అసలు సూత్రధారి!
MLA Arekapudi Gandhi | కాంగ్రెస్ పార్టీలో చేరిన శేరిలింగపల్లి ఎమ్మెల్యే
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

