IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)కు మరో షాక్. అసలే ఓటమి బాధలో ఉన్న ఆ జట్టు ప్రధాన పేసర్ ముకేశ్ కుమార్ (Mukesh Kumar)కు జరిమానా పడింది. ఐపీఎల్ కోడ్ ఉల్లంఘించినందుకు అతడి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు రెఫరీ. బుధవారం వాంఖడే మైదానంలో ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో జరిగిన మ్యాచ్‌లో ముకేశ్ లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడు.
ఈ విషయాన్ని గుర్తించిన రిఫరీ ఐపీఎల్ క్రమశిక్షణ కమిటీకి ఈ స్పీడ్‌స్టర్‌పై ఫిర్యాదు చేశాడు. మ్యాచ్ అనంతరం.. విచారించగా ఢిల్లీ పేసర్ తన తప్పును అంగీకరించాడు. దాంతో, అతడికి 10 శాతం జరిమానా విధించారు. ‘ముకేశ్ కుమార్ ఆర్టికల్ 2.2 ప్రకారం లెవల్ 1 తప్పిదం చేశాడు. మ్యాచ్ అనంతరం మ్యాచ్ రిఫరీ తనపై విధించిన జరిమానాను అతడు అంగీకరించాడు. లెవల్ 1 పొరపాట్ల విషయంలో రిఫరీ నిర్ణయమే ఫైనల్’ అని ఐపీఎల్ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.
🚨 #DelhiCapitals pacer Mukesh Kumar has been fined 10% of his match fees, and handed one demerit point for Code of Conduct breach during #MIvsDC game at the Wankhede#MIvDC #CricketTwitter #IPL2025 pic.twitter.com/jUZX3OI6YA
— Cricbuzz (@cricbuzz) May 22, 2025
ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో ముకేశ్ ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ, చివరి రెండు ఓవర్లలో తేలిపోయాడు. సూర్యకుమార్ యాదవ్ (73 నాటౌట్), నమన్ ధిర్(24 నాటౌట్)ల విధ్వంసంతో ఈ స్పీడ్‌స్టర్ 48 పరుగులతో తన కోటాను పూర్తి చేశాడు.
ముంబై నిర్దేశించిన 181 పరుగుల ఛేదనలో ఢిల్లీ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఓపెనర్ కేఎల్ రాహుల్(11), డూప్లెసిస్ (6), అభిషేక్ పొరెల్(6)లు.. పవర్ ప్లేలోనే పెవిలియన్ చేరారు. అనంతరం మిచెల్ శాంట్నర్(3-11) తిప్పేయడంతో.. విప్రజ్ నిగమ్(20), అశుతోష్ శర్మ(18)లు వెనుదిరిగారు. మిడిల్ ఓవర్లలో నిప్పులు చెరిగిన బుమ్రా(3-12).. ఆఖరి బ్యాటర్ ముస్తాఫిజుర్‌ను బౌల్డ్ చేయగా ముంబై 59 పరుగుల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో సమీర్ రిజ్వీ 39 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
It was a new beginning, a beautiful beginning – so to end the dream this way really stings tonight.
We’ll be back – smarter, stronger, better.
And we’ll bring a whole lot of heart, just like you fans do each and every year, no matter what. 💙❤️
Sorry, Dilli. 💔
— Delhi Capitals (@DelhiCapitals) May 21, 2025
నామమాత్రమైన చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ మే24 న పంజాబ్ కింగ్స్(Punjab Kings)ను ఢీ కొననుంది. బుధవారం ముంబైని ఓడించి ఉంటే.. ఈ మ్యాచ్ ఫలితంపై ఇరుజట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలు అధారపడి ఉండేవి. కానీ, ఢిల్లీ చేజేతులా ఓడి.. నాకౌట్ ఛాన్స్‌ను మిస్ చేసుకుంది.