పెద్దమందడి : పెద్దమందడి మండలంలోని దొడగుంటపల్లి గ్రామంలో గురువారం హనుమాన్ జయంతి (Hanuman Jayanti ) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఆలయంలో ఆకు పూజ చేసి హనుమాన్ విగ్రహానికి అభిషేకాలు ( Abhishekam) నిర్వహించారు. సాయంత్రం గ్రామంలోని హనుమాన్ విగ్రహానికి ఊరేగింపు నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమాలను గ్రామస్థుల సహాయ సహకారాలతో నిర్వహించామని ఛత్రపతి శివాజీ యువజన సంఘం సభ్యులు తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, మధ్యాహ్నం అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు భాస్కర్, రాఘవేందర్ రెడ్డి, కురుమూర్తి, భాను, కుమార్, గ్రామ పెద్దలు, కొన్నూరు శ్రీనివాసరెడ్డి, జానకి రాములు, సుదర్శన్, చెన్నారెడ్డి, వెంకటేష్, రమేష్ తదితరులు ఉన్నారు.