IPL 2025 : ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ల దంచికొడుతున్నారు. యువకెరటం జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్(17), ఫాఫ్ డూప్లెసిస్(32)లు బౌండరీలతో విరుచుకుపడుతున్నారు. దాంతో, ఢిల్లీ స్కోర్ రాకెట్ వేగంతో పరుగులు తీస్తోంది. ఈ ఇద్దరు ధనాధన్ ఆడుతుండడంతో ఢిల్లీ స్కోర్ 6 ఓవర్లకు వికెట్ కోల్పోకుండా 52 పరుగులు కొట్టింది. ఈ జోడీని విడదీసేందుకు కెప్టెన్ కమిన్స్ బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది.
సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అనికేత్ వర్మ(74) విశాఖపట్టణంలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడిన ఈ చిచ్చరపిడుగు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. మిచెల్ సట్ఆర్క్(5-35) విజృంభణతో టాపార్డర్ విఫలమవ్వగా.. జట్టుకు భారీ స్కోర్ అందించే బాధ్యతను భుజాన వేసుకున్నాడీ కుర్రాడు.
Aniket Sharma put on a show to revive SRH with 74(41)
Watch his innings 📽️#TATAIPL | #DCvSRH | Watch 🔽
— IndianPremierLeague (@IPL) March 30, 2025
ఓపెనర్ ట్రావిస్ హెడ్(22).. ఔటయ్యాక అనికేత్ వర్మ(74 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు) ఉతికారేశాడు. అలవోకగా సిక్సర్లు బాదుతూ జట్టు స్కోర్ 150 దాటించాడు. అనికేత్ వికెట్ పడ్డాక సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టలేదు. స్టార్క్ బౌలింగ్లో మల్డర్ ఔట్ కావడంతో హైదరాబాద్ జట్టు 163 పరుగులకే కుప్పకూలింది.