IPL 2025 : ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు చేసుకోవాలనుకున్న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు పెద్ద షాక్. సాంకేతిక కారణాల వల్ల ధర్మశాలలో వేదికగా జరుగుతున్న మ్యాచ్ రద్దయ్యింది. పంజాబ్ ఇన్నింగ్స్ మధ్యలో ఫ్లడ్ లైట్ వెలగకపోవడంతో.. సాంకేతిక కారణాలతో మ్యాచ్‌ను ఆపేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. ఇరుజట్లకు చెరొక పాయింట్ కేటాయించనున్నారు.
వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ చివరకు ఫలితం తేలకుండానే రద్దయ్యింది. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ 10.1 ఓవర్ వద్ద ఫ్లడ్ లైట్ హఠాత్తుగా ఆగిపోయింది. దాన్ని సరిచేసేందుకు సిబ్బంది ప్రయత్నించారు. కానీ, అది వెలగకపోవడంతో ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ 21:57 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది.
#PBKSvDC has been called off. pic.twitter.com/7IiqWTrxUB
— ESPNcricinfo (@ESPNcricinfo) May 8, 2025
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకోగా 830 గంటలకు టొలి బంతి పడింది. మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్లోనే వరుసగా రెండు ఫోర్లతో ప్రియాన్ష్ ఆర్య(70) తన ఉద్దేశాన్ని చాటాడు. అనంతరం ప్రభ్‌సిమ్రన్ సింగ్(50 నాటౌట్) స్టార్క్‌ను టార్గెట్ చేస్తూ మూడ ఫోర్లు బాది 12 పరుగులు పిండుకున్నాడు. అనంతరం .. చమీర బౌలింగ్‌లో ప్రియాన్ష్ సిక్సర్‌తో పంజాబ్ స్కోర్ 4 ఓవర్లకే 50కి చేరింది. ఆ తర్వాత అక్షర్ పటేల్ బౌలింగ్‌లోనూ సిమ్రన్ 4, ప్రియాన్స్ 6 కొట్టగా 15 రన్స్ వచ్చాయి. వీళ్లిద్దరి మెరుపులతో పంజాబ్ 6 ఓవర్లకు వికెట్ కోల్పోకుండా 69 పరుగులు చేసింది.
Priyansh Arya served up special shots like these during his entertaining 7⃣0⃣(34) 👏
Updates ▶ https://t.co/R7eQDiYQI9 #TATAIPL | #PBKSvDC | @PunjabKingsIPL pic.twitter.com/uajDx9NJ6V
— IndianPremierLeague (@IPL) May 8, 2025
తొలి ఓవర్ నుంచి ఢిల్లీ బౌలర్లను ఉతికేస్తున్న ప్రియాన్ష్ 25 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన ప్రియాన్ష్ ఆ తర్వాత సింగిల్ తీసి యాభైకి చేరువయ్యాడీ చిచ్చరపిడుగు. ఆ తర్వాత సిమ్రన్ సైతం 28 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. దంచి కొడుతున్న ఈ జోడీని నటరాజన్ విడదీశాడు. 10 వ ఓవర్ తొలి బంతికి ప్రియన్ష్ను ఔట్ చేసిన నటరాజన్ 122 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. దాంతో, ఢిల్లీ జట్టు ఊపిరిపీల్చుకుంది. శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి వచ్చిన కాసేపటికే ఒక ఫ్లడ్ లైట్ పని చేయలేదు. కాసేపటికే మరో రెండు ఆగిపోయాడు. దాంతో, అప్రమత్తమైన అధికారులు కరెంటు పునరుద్ధరణకు ప్రయత్నించారు. కానీ లాభం లేకపోవడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.