ENG vs SA : సూపర్ 8 కీలక మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఓపెనర్లు ఉతికేస్తున్నారు. సెయింట్ లూయిస్ వేదికగా క్వింటన్ డికాక్(53) సిక్సర్లతో హోరెత్తిస్తున్నాడు. పవర్ ప్లేలో దంచేసిన డికాక్.. ఆదిల్ రషీద్ ఓవర్లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ సాధించాడు. మరో ఎండ్లో రీజా హెండ్రిక్స్(13) ఆచితూచి ఆడుతున్నాడు. దాంతో, ఈ మెగా టోర్నీలో సఫారీ ఓపెనింగ్ జోడీ తొలిసారి 50 ప్లస్ పరుగుల భాగస్వామ్యం నిర్మించింది. 7 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్.. 69/0.
సెయింట్ లూయిస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్ టాస్ గెలిచాడు. సఫారీలను తక్కువకే కట్టడి చేయాలనే లక్ష్యంతో బౌలింగ్ తీసుకున్నాడు. సూపర్ 8 దశను విజయంతో ఆరంభించిన ఇరుజట్లు ఈ మ్యాచ్లోనూ గెలుపుపై కన్నేశాయి. ఈ సమఉజ్జీల సమరంలో ఎవరు పైచేయి సాధిస్తారు? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.