IND vs SA : టీ20 సిరీస్‌ను భారీ విజయంతో ఆరంభించిన భారత జట్టుకు భారీ షాక్. ముల్లన్‌పూర్‌లో క్వింటన్ డికాక్(90) మెరుపులతో భారీ స్కోర్ చేసిన దక్షిణాఫ్రికా బౌలర్ల విజృంభణతో సిరీస్ సమం చేసింది. 214 పరుగుల ఛేదనలో టాపార్డర్ విఫలమవ్వగా తిలక్ వర్మ(62), జితేశ్ శర్మ(27)లు మాత్రమే పోరాడారు. కానీ, లుంగి ఎంగిడి(2-26), బార్ట్‌మన్ (4-24)ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టారు. దాంతో.. 51 పరుగుల తేడాతో ప్రొటీస్ జట్టు సిరీస్ సమం చేసింది.
పొట్టి సిరీస్‌లో భారత జట్టు జోరుకుబ్రేక్ పడింది. కటక్‌లో ఏకపక్ష పోరులో కంగుతిన్న దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్లోగొప్పగా పుంజుకొని ఆతిథ్య జట్టుకు షాకిచ్చింది. 214 ఛేదనలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(0) మరోసారి విఫలమవ్వగా.. దంచేస్తున్న అభిషేక్ శర్మ(17)ను యాన్సెన్ పెవిలియన్ పంపి బ్రేకిచ్చాడు. సఫారీ బౌలర్లు వికెట్ల వేటతో ఒత్తిడి పెంచారు. 67కే నాలుగు వికెట్లు పడిన వేళ తిలక్ వర్మ (62), హార్దిక్ పాండ్యా(20)లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ, సిపమ్లా ఓవర్లో పాండ్యా ఔట్ కావడంతో మ్యాచ్‌పై ఆశలు సన్నగిల్లాయి. ఆఖర్లో జితేశ్ శర్మ(27) ధనాధన్ ఆడినా.. ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన బార్ట్‌మన్ (4-24) సఫారీలకు భారీ విజయాన్ని అందించాడు.
South Africa win the 2nd T20I by 51 runs.#TeamIndia will aim to come back strongly in the 3rd T20I in Dharamshala.
Scorecard ▶️ https://t.co/japA2CIofo#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/P2HOiMUPDo
— BCCI (@BCCI) December 11, 2025
తొలి టీ20లో 74 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్(90) విధ్వసంక ఆటతో రెండొందలు కొట్టింది. ముల్లనూర్ స్టేడియంలో భారత బౌలర్లను ఉతికేసిన డికాక్ మెరుపు అర్ధ శతకంతో చెలరేగాడు. సిక్సర్ల మోత మోగించిన అతడిని జితేశ్ శర్మ స్టంపౌట్ చేసి బ్రేకిచ్చాడు. కానీ, ఆఖర్లో డొనోవాన్ ఫెరీరా(30 నాటౌట్), డేవిడ్ మిల్లర్(20 నాటౌట్)లు ధనాధన్ ఆడారు. చివరి మూడు ఓవర్లలో ఈ ద్వయం 49 రన్స్ పిండుకోగా నిర్ణీత ఓవర్లలో ప్రొటిస్ టీమ్ 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.