RCBW vs UPWW : డబ్ల్యూపీఎల్ రెండో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు చెలరేగుతున్నారు. పవర్ ప్లేలోనే ఓపెనర్ హర్లిన్ డియోల్(11)ను లారెన్ బెల్(1-16) ఔట్ చేసి యూపీ వారియర్స్‌కు షాకిచ్చింది. ఆ తర్వాత నడినే డిక్కెర్కో(2-2) ఒకే ఓవర్లో వరుసగా రెండు వికెట్లు తీసి హ్యాట్రిక్‌పై నిలిచింది. కానీ, డియాండ్ర డాటిన్(2 నాటౌట్) డిఫెన్స్ ఆడి తప్పించుకుంది. ప్రస్తుతం డాటిన్ జతగా దీప్తి శర్మ(3 నాటౌట్) క్రీజులో ఉంది.
టాస్ ఓడిన యూపీ వారియర్స్‌ను బెంబేలెత్తిస్తూ లారెన్ బెల్(1-13) వికెట్ల వేట మొదలెట్టింది. ఓపెనర్ హర్లిన్ డియల్ను వెనక్కి పంపి తొలి బ్రేకిచ్చింది .అనంతరం.. శ్రేయాంక పాటిల్ ఓవర్లో కెప్టెన్ మేగ్ లానింగ్(14) రాధా యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యింది. బౌండరీలతో ఆర్సీబీ బౌలర్లపై ఒత్తిడి పెంచాలనుకున్న డేంజరస్ ఫొబే లిచ్‌ఫీల్డ్()ను శ్రేయాంక డగౌట్ చేర్చింది.
Two HUGE wickets!
Shreyanka Patil turning it around for @RCBTweets ❤️
Updates ▶️ https://t.co/U1cgf01ys0#TATAWPL | #KhelEmotionKa | #RCBvUPW pic.twitter.com/l6hDpBrfX1
— Women’s Premier League (WPL) (@wplt20) January 12, 2026
స్వల్ప వ్యవధలో మూడు వికెట్లు పడడంతో కష్టాల్లో కూరుకుపోయిన యూపీని నదినే డీక్లెర్క్(2-2) మరింత దెబ్బతీసింది. తను ఒకే ఓవర్లో వరుసగా కిరణ్ నవగరి(5), శ్వేతా షెహ్రావత్(0)లను వెనక్కి పంపింది. దాంతో.. 50కే యూపీ జట్టు సగం వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లకు స్కోర్.. 56-5.