WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్లో ఆఖరి ఓవర్ థ్రిల్లర్లే కాదు ప్లే ఆఫ్స్ బెర్తులు ఆసక్తి రేపుతున్నాయి. ఆరు విజయాలతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) దర్జాగా ఫైనల్ చేరగా.. చివరి రెండు బెర్తులపై ఉత్కంఠ నెలకొంది. నాకౌట్ దశకు గుజరాత్ జెయింట్స్ అతి చేరువగా ఉండగా.. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు కూడా ముందంజ వేసే అవకాశాలులన్నాయి. లీగ్ దశలో రెండే రెండు మ్యాచ్‌లు ఉన్నందున ముంబై, ఢిల్లీ, గుజరాత్ మధ్య ప్లే ఆఫ్స్ కోసం త్రిముఖ పోరు ఏర్పడింది.
అంచనాలకు అందకుండా సాగుతున్న నాలుగో సీజన్లో ఆర్సీబీ ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. చివరి లీగ్ మ్యాచ్‌లో యూపీవారియర్స్ను చిత్తు చేసిన స్మృతి మంధాన సేన 12 పాయింట్లతో టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. ఇక మిగిలిన నాలుగు జట్లు ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం చెమటోడ్చాల్సిందే. చివరి రెండు బెర్తుల కోసం మూడు జట్ల మధ్య పోటీ నెలకొంది. జనవరి 30 శుక్రవారం గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఫలితం కీలకం కానుంది.
ప్రస్తుతం 8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన గుజరాత్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ బెర్తుకు చేరువలో ఉంది. గత మ్యాచ్‌లో మూడు పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన ఆ జట్టు.. చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడిస్తే చాలు. దర్జాగా10 పాయింట్లతో బెర్తు దక్కించుకుంటుంది. ఒకవేళ ముంబై విజయం సాధిస్తే.. 8 పాయింట్లతో ఇరుజట్లు రేసులోనే ఉంటాయిది. అయితే.. చివరి లీగ్ మ్యాచ్‌లో యూపీ వారియర్స్ చేతిలో ఢిల్లీ ఓడిందంటే గుజరాత్, ముంబై నాకౌట్‌కు దూసుకెళ్తాయి.
A spot in the playoffs at stake 🔥
It all comes down to this for @Giant_Cricket and @mipaltan 👊#TATAWPL | #KhelEmotionKa | #GGvMI pic.twitter.com/jhHFtXziDj
— Women’s Premier League (WPL) (@wplt20) January 30, 2026
మూడు విజయాలతో మూడో స్థానంలో కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ కాస్త కష్టపడితే ప్లే ఆఫ్స్ చేరడం పక్కా. ఎందుకంటే ఢిల్లీ, యూపీ కంటే ఆ జట్టు రన్‌రేటులో మెరుగ్గా ఉంది. శుక్రవారం గుజరాత్ జెయింట్స్‌తో జరుగనున్న మ్యాచ్ హర్మన్‌ప్రీత్ కౌర్ బృందానికి కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. 8 పాయింట్లతో ముంబై రేసులో నిలుస్తుంది.
జనవరి 26న ఆర్సీబీపై సెంచరీతో గర్జించిన నాట్ సీవర్ బ్రంట్ గుజరాత్‌పైనా చెలరేగాలని ముంబై కోరకుంటోంది. ఒకవేళ గుజరాత్ గెలిస్తే యూపీ చేతిలో ఢిల్లీ ఓడితేనే ముంబైకి అవకాశాలుంటాయి. అలాకాకుండా 50 పరుగుల తేడాతో మ్యాచ్ చేజార్చుకుంటే.. ఢిల్లీ 7 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో యూపీపై ఓటమి చవిచూడాలి. యూపీ జట్టు 116 పరుగుల తేడాతో గెలవకూడదు. అప్పుడు.. నెట్ రన్‌రేట్ పరంగా ముంబై ముందంజ వేస్తుంది.
వరుసగా నాలుగు ఓటముల తర్వాత అద్భుతంగా పుంజుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. కానీ, జనవరి 27న గుజరాత్ జెయింట్స్ చేతిలో 3 పరుగుల తేడాతో ఓడడం ఆ జట్టు అవకాశాలపై ప్రభావం చూపింది. అయినా సరే గుజరాత్, ముంబై మ్యాచ్‌తో సంబంధం లేకుండా ఢిల్లీ ప్లే ఆఫ్స్ చేరేందుకు ఛాన్సుంది.
Scored 70 (31) together and almost did the unthinkable 👏 pic.twitter.com/SsvLS8jK7J
— Delhi Capitals (@DelhiCapitals) January 27, 2026
చివరి లీగ్ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై గెలిస్తేనే జెమీమా రోడ్రిగ్స్ నేన ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఒకవేళ యూపీ చేతిలో ఓడితే.. గుజరాత్ ధాటికి ముంబై చతికిలపడితే ఆరు పాయింట్లతో ఉత్కంఠ కొనసాగుతుంది. ముంబై, ఢిల్లీ, యూపీలో అప్పుడు నెట్రన్ రేటు పరంగా మెరుగ్గా ఉన్న జట్టు ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుంది.
మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఎలిమినేషన్‌కు దగ్గర్లో ఉన్న జట్టు ఏదంటే అది యూపీ వారియర్స్. గురువారం ఆర్సీబీ చేతిలో ఓటమి యూపీ ప్లే ఆఫ్స్ అవకాశాల్ని దెబ్బతీసింది. ప్రస్తుతం నాలుగు పాయింట్లతో, మైనస్ రన్‌రేటు(-1.146)తో ఉన్న మేగ్ లానింగ్ బృందం ముందంజ వేయాలంటే అద్భుతం జరగాల్సిందే.
— UP Warriorz (@UPWarriorz) January 29, 2026
చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీని భారీ తేడాతో ఓడిస్తే యూపీ 6 పాయింట్లతో పోటీలో నిలుస్తుంది. అయితే.. ముంబై, ఢిల్లీ కంటే రన్‌రేటు ఎక్కువ ఉండాలి. ముంబై జట్టు 50 పరుగుల తేడాతో గుజరాత్ చేతిలో ఓడితే.. ఢిల్లీని 117 రన్స్ తేడాతో యూపీ ఓడించాల్సి వస్తుంది. అప్పుడే ఫిబ్రవరి 3న జరుగబోయే ఎలిమినేటర్ ఆడే అవకాశం దక్కించుకుంటుంది.