నాగ్‌ఫూర్: విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీస్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై కష్టాల్లో పడింది. రెండో రోజు ప్రత్యర్థిని 383 పరుగులకు ఆలౌట్ చేసిన ముంబై.. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 188 రన్స్ చేసింది. ఓపెనర్ ఆకాశ్ ఆనంద్ (67 బ్యాటింగ్) అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు.
మొదటి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఇంకా 195 పరుగులు వెనుకబడి ఉంది. ముంబై సారథి అజింక్యా రహానే (18) నిరాశపరచగా టీమ్ఇండియా సూపర్ స్టార్లు సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె డకౌట్ అయ్యారు. విదర్భ బౌలర్లలో పార్థ్ (3/16), యశ్ ఠాకూర్ (2/56) ముంబైని కట్టడి చేశారు. ఇక అహ్మదాబాద్‌లో గుజరాత్‌తో జరుగుతున్న మరో సెమీస్‌లో కేరళ 418/7 పరుగుల భారీ స్కోరు చేసింది. అజారుద్దీన్ (149 బ్యాటింగ్) సెంచరీతో మెరిశాడు.