వడోదర : సొంతగడ్డపై వెస్టిండీస్‌తో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. గురువారం వడోదరలో జరిగిన మూడో వన్డేలో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. సీనియర్ స్పిన్నర్ దీప్తి శర్మ (6/31, 39 నాటౌట్) ఆల్‌రౌండ్ షో తో పర్యాటక విండీస్‌కు వైట్‌వాష్ తప్పలేదు. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. 38.5 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయింది. హెన్రీ (61), క్యాంప్బెల్లె (46) మినహా మిగిలిన బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరు చేయడానికే తంటాలు పడ్డారు. ఆరంభంలో రేణుకా సింగ్ ఠాకూర్ (4/29) పదునైన పేస్‌తో చతికిలపడ్డ విండీస్‌ను ఆ తర్వాత దీప్తి కోలుకోనీయకుండా చేసిం ది. అనంతరం ఛేదనను భారత్ 28.2 ఓవర్లలో పూర్తిచేసింది. దీప్తితో పాటు సారథి హర్మన్‌ప్రీత్ (32), రోడ్రిగ్స్ (29), రిచా (23 నాటౌట్) రాణించారు. దీప్తికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, రేణుకాకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది.