Lords Test : లార్డ్స్ వేదికగా జరుగుతున్న చరిత్రాత్మక టెస్టులో భారత జట్టు ఆలౌటైంది. ఓపెనర్ స్మృతి మంధాన (83), హర్మన్‌ప్రీత్ కౌర్(58)లు అర్ధ శతకాలతో పటిష్టమైన పునాది వేశారు. కానీ, ఇంగ్లండ్ స్పిన్నర్ మ్యాడీ విల్లియర్స్(2-79) ధాటికి మిడిలార్డర్ వైఫలమైంది. ఓవైపు వికట్లు పడుతున్నా బాధ్యతగా ఆడిన దీప్తి శర్మ(57) టెయిలెండర్లతో కలిసి పోరాడి స్కోర్ 280 దాటించింది. కానీ, ఒకే ఓవర్లో దీప్తిని, క్రాంతి గౌడ్‌ను ఔట్ చేసిన సోఫీ ఎకిల్‌స్టోన్(3-68) భారత ఇన్నింగ్స్‌కు తెరదించింది.
ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానం వేదికగా జరుగుతున్న చరిత్రాత్మక టెస్టులో భారత జట్టు మూడో సెషన్లోనే కుప్పకూలింది. తొలి సెషన్లో.. ఆపై లంచ్ తర్వాత కూడా ధీటుగా ఆడిన టీమిండియాను ఇంగ్లండ్ బౌలర్లు 285కే కట్టడి చేశారు. టాస్ ఓడిన భారత్ రెండో ఓవర్లోనే ఓపెనర్ షఫాలీ వర్మ(0) వికెట్ కోల్పోయింది. షఫాలీ డకౌటవ్వగా.. క్రీజులో కుదురుకున్నట్టే కనిపించిన యస్తికా భాటియా(12) సైతం నిరాశపరిచింది.
Innings Break!
Half-centuries from Harmanpreet Kaur, Smriti Mandhana, and Deepti Sharma guided #TeamIndia‘s 1️⃣st innings 🤝
Scorecard ▶️ https://t.co/O1rEau8j8n#ENGvIND pic.twitter.com/jloz7bLO5A
— BCCI Women (@BCCIWomen) July 10, 2026
37 పరుగులకే రెండు కీలక వికెట్లు పడినా ఓపెనర్ స్మృతి మంధాన(83) ఒత్తిడకి లోనవ్వకుండా పట్టుదలగా ఆడింది.. జెమీమా రోడ్రిగ్స్(35)తో కలిసి ఆతిథ్య జట్టు బౌలర్లను కాచుకున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ యాభైకి పైగా రన్స్ జోడించింది. ఇసీ వాంగ్ ఓవర్లో బంతిని వికెట్ల మీదకు ఆడుకొని జెమీమా బౌల్డైంది. అనంతరం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(58)తో కలిసి స్కోర్ 120 దాటింది. అర్ధ శతకం పూర్తి చేసుకున్న మంధానతో పాటు హర్మన్‌ప్రీత్ క్రీజులో నిలవడంతో భోజన విరామానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది.
లంచ్ బ్రేక్ అనంతరం శతకానికి చేరువైన మంధానను ఇసీ వాంగ్ బోల్తా కొట్టించింది. అనంతరం సీనియర్ బ్యాటర్ దీప్తి శర్మ(57) జతగా ఇన్నింగ్స్ నిర్మించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ జట్టకు భారీ స్కోర్ అందించే బాధ్యత తీసుకుంది. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును నడిపించారు. టెస్టుల్లో రెండో హాఫ్ సెంచరీ బాదిన హర్మన్‌ప్రీత్‌ను మ్యాడీ క్లీన్ బౌల్డ్ కావడంతో దీప్తి ఆ తర్వాత మరింత బాధ్యతగా ఆడింది.
What an occasion to bring up your 5️⃣th Test fifty 🔝
Deepti Sharma keeps the runs flowing for #TeamIndia 👏
Updates ▶️ https://t.co/O1rEau8j8n#ENGvIND | @Deepti_Sharma06 pic.twitter.com/nImcBFWB7L
— BCCI Women (@BCCIWomen) July 10, 2026
రీచా ఘోష్(13) విఫలమవ్వగా.. స్నేహ్ రాణా(13) తో కలిసి స్కోర్ 250 దాటించిందీ ఆల్‌రౌండర్. ఏడో వికెట్‌కు 45 రన్స్ జోడించిన ఈ జంటను ఎట్టకేలకు మ్యాడీ విడీసింది. అంపైర్ నాటౌట్ ఇవ్వగా రివ్యూ తీసుకున్న ఇంగ్లండ్ రాణా వికెట్ సాధించింది. ఎకిల్‌స్టోన్ తిప్పేయగా ఒకే ఓవర్లో దీప్తి, క్రాంతి గౌడ్() ఔటవ్వగా మూడొందలకు పైగా కొడుతుందనుకున్న అనూహ్యంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 285కే ఆలౌటైంది.