Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో పతకం గెలవాలనుకున్న భారత సీనియర్ ఆర్చర్ దీపికా కుమారి (DeepikaKumari) కల చెదిరింది. విశ్వ క్రీడల్లో రెండో సారి క్వార్టర్ ఫైనల్ చేరిన దీపిక సెమీ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. శనివారం దక్షిణ కొరియా ఆర్చర్ సు హైయన్ (Su Hyeon)చేతిలో 4-6తో ఓటమి పాలైంది. దాంతో, ఆమెపై కోట్లాది మంది పెట్టుకున్న ఒలింపిక్ మెడల్ ఆశలన్నీఅడియాశలయ్యాయి.
ఒలింపిక్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన దీపిక శుక్రవారం క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టి పతకంపై ఆశలు రేపింది. దాంతో, కనీసం కాంస్యంతో ఆమె చరిత్ర సృష్టించడం ఖాయమనుకున్నారంతా. కానీ, సెమీస్‌లో దీపిక అనూహ్యంగా తడబడింది.
#OlympicGames Recurve Women’s Individual 1/8 Elimination Round
Deepika Kumari defeats Germany’ M. Kroppen 6-4 to qualifiy for the 1/4 Elimination Round for Today 5:09 PM Deepika Kunari🇮🇳 Vs Suhyeon Nam🇰🇷 on Live action on Jio Cinema and DD Sports 🏹🇮🇳
All the best #Deepika🏹🇮🇳 pic.twitter.com/v1vC8HbXpv
— ARCHERY ASSOCIATION OF INDIA (@india_archery) August 3, 2024
దక్షిణ కొరియా ఆర్చర్‌ను తొలి సెట్లో 28-26తో వెనక్కి నెట్టిన భారత ఆర్చర్.. రెండో సెట్‌ను 25-28తో కోల్పోయింది. కీలకమైన మూడో సెట్లో 29-28తో దీపిక విజయం సాధించినా ఆఖరి సెట్లో 10, 7, 10 పాయింట్లు సాధించింది. దాంతో, ఫలితంపై ఉత్కంఠ మొదలైన వేళ సు 10, 9, 10 పాయింట్లతో దీపికకు షాకిచ్చింది.
ఎనిమిదో రోజుతో విశ్వ క్రీడల ఆర్చరీలో భారత పోరాటం ముగిసింది. శనివారం మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సెమీస్ చేరిన బొమ్మదేవర ధీరజ్, అకింత భకత్లు వరల్డ్ నంబర్ 1 దక్షిణ కొరియా జంట ముందు తేలిపోయారు. ఆ తర్వాత కాంస్య పతక పోరులోనూ అమెరికా జోడీకి గట్టి పోటీనిచ్చినా పతకం మాత్రం గెలవలేకపోయారు.