శనివారం 26 సెప్టెంబర్ 2020
Sports - Sep 04, 2020 , 00:21:42

దీపక్‌కు కరోనా

దీపక్‌కు కరోనా

న్యూఢిల్లీ: భారత స్టార్‌ రెజ్లర్‌ దీపక్‌ పునియాకు కరోనా సోకింది. అతడితో పాటు మరో ఇద్దరు రెజ్లర్లు కొవిడ్‌-19 బారిన పడినట్లు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) గురువారం పేర్కొంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన దీపక్‌ పునియా (86 కేజీలు)తో పాటు నవీన్‌ (65 కేజీలు), క్రిషన్‌ (125 కేజీలు) ఈ జాబితాలో ఉన్నారు. సోనీపట్‌లో మంగళవారం ప్రారంభమైన  సాయ్‌ జాతీయ శిక్షణ శిబిరంలో పాల్గొన్న ఈ ముగ్గురికీ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. 


logo