న్యూఢిల్లీ: జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్ష ఎన్నికపై రగడ కొనసాగుతూనే ఉన్నది. బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్ సన్నిహితుడైన సంజయ్‌సింగ్ ఎన్నికను వ్యతిరేకిస్తూ ఇప్పటికే సాక్షి మాలిక్ తన కెరీర్‌కు వీడ్కోలు పలుకగా, బజరంగ్ పునియా బాటలో ఇప్పుడు డెఫిలింపిక్స్ స్వర్ణ విజేత వీరేందర్‌సింగ్ యాదవ్ తన పద్మశ్రీ అవార్డు వాపస్ ఇస్తున్నట్లు శనివారం ప్రకటించాడు.
‘గూంగా పహిల్వాన్’గా పేరొందిన వీరేందర్‌సింగ్..మహిళా రెజ్లర్లకు జరుగుతున్న అన్యాయానికి తన మద్దతు ప్రకటించాడు. ‘నా పద్మశ్రీ అవార్డును ఈ దేశ ఆడబిడ్డలు, నా సోదరిమణుల కోసం వాపస్ ఇస్తున్నాను. గౌరవనీయులైన ప్రధాని మోదీ గారు రెజ్లర్లకు జరుగుతున్న అన్యాయంపై స్పందించాలి’ అని వీరేందర్ ట్వీట్ చేశాడు.