SAW vs ENGW : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన హీథర్ నైట్ బృందం రెండో పోరులో బలమైన దక్షిణాఫ్రికాను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఆల్‌రౌండర్ నాట్ సీవర్ బ్రంట్(48 నాటౌట్), ఓపెనర్ డానియల్ వ్యాట్(43) అద్భుత ఇన్నింగ్స్ ఆడి విజయాన్ని లాగేసుకున్నారు. విజయానికి 4 పరుగులు అవసరం కాగా సీవర్ బ్రంట్ బౌండరీతో ఇంగ్లండ్‌కు రెండో విజయాన్ని కట్టబెట్టింది. ఫీల్డింగ్‌లో చెత్త ప్రదర్శన కనబరిచిన సఫారీ జట్టు రెండు సులువైన క్యాచ్‌లను జారవిడిచి మ్యాచ్ చేజార్చుకుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగుతున్న మహిళల పొట్టి వరల్డ్ కప్‌లో అదిరే బోణీ కొట్టిన దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్‌లో చతికిలబడింది. బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించినా పేలవమైన ఫీల్డింగ్‌తో ఇంగ్లండ్‌కు విజయాన్ని కానుకగా అప్పగించింది. 125 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్‌కు శుభారంభం దక్కలేదు.
Danni Wyatt-Hodge and Nat Sciver-Brunt keep the runs flowing as England bring up their 100
24 needed from 24 now 👀
🔗 https://t.co/11nB7okUN5 | #T20WorldCup pic.twitter.com/rRgLKKxFBF
— ESPNcricinfo (@ESPNcricinfo) October 7, 2024
అయినా ఓపెనర్ డానియల్ వ్యాట్(43) క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లు ఆడింది. ఆమెకు జతకలిసిన నాట్ సీవర్ బ్రంట్(48 నాటౌట్) సైతం స్వీప్ షాట్ల ద్వారా బౌండరీలతో చెలరేగింది. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు అభేద్యమైన 64 రన్స్ కలిపి సఫారీలకు షాకిచ్చారు. విజయానికి 11 పరుగులు అవసరమైన దశల్ వ్యాట్ ఔట్ అయినా.. సీవర్ బ్రంట్ లాంఛనం పూర్తి చేయగా 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయ గర్జన చేసింది.
తొలుత ఆడిన దక్షిణాఫ్రికాను ఇంగ్లండ్ తక్కువ స్కోర్‌కే కట్టడి చేసింది. ఆరంభంలో దూకుడుగా ఆడిన సఫారీలు మిడిల్ ఓవర్లలో తడబడ్డారు. ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎకిల్‌స్టోన్(2/15) తిప్పేయడంతో ప్రధాన ప్లేయర్లు డగౌట్‌కు చేరారు. ఓవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ లారా వొల్వార్డ్త్(42) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఆఖర్లో సీనియర్ ఆల్‌రౌండర్ మరినే కాప్(19) రాణించడంతో దక్షిణాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.