IND vs ENG: భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాలతో సిరీస్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. తాజాగా ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బ్రూక్ స్థానంలో సర్రే బ్యాటర్ డాన్ లారెన్స్‌ను తుది జట్టులోకి తీసుకొచ్చింది. 26 ఏండ్ల లారెన్స్.. ఇప్పటివరకూ 11 టెస్టులు ఆడి 21 ఇన్నింగ్స్‌లలో 29 సగటుతో 551 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్థ సెంచరీలున్నాయి.
మిడిలార్డర్ బ్యాటర్ అయిన లారెన్స్‌కు బౌలింగ్‌లోనూ ప్రావీణ్యముంది. టెస్టులలో అతడు మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో రెండేండ్ల క్రితం అరంగేట్రం చేసిన లారెన్స్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌తో పాటు టీ20లలో దుమ్మురేపుతున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 118 మ్యాచ్‌లు ఆడిన లారెన్స్.. 6,360 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్లో అతడి ఖాతాలో 15 శతకాలున్నాయి. ఇక టీ20లలో 112 మ్యాచ్‌లు ఆడి 2,514 పరుగులు చేయడమే గాక 41 వికెట్లు కూడా పడగొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రాణిస్తున్నా లారెన్స్‌కు ఇంకా అంతర్జాతీయ స్థాయిలో టీ20లు ఆడే అవకాశం దక్కలేదు.
Surrey’s Dan Lawrence to join the England Men’s Test squad in the next 24 hours.
🇮🇳 #INDvENG 🏴 pic.twitter.com/DepT9duRnZ
— England Cricket (@englandcricket) January 21, 2024
ఇండియాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ అండర్సన్, రెహన్ అహ్మద్, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్ స్టో, షోయబ్ బాషిర్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హర్ట్లీ, జాక్ లీచ్, ఒలీ పోప్, ఒలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్, డాన్ లారెన్స్