భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా మరోసారి సత్తాచాటాడు. కామన్వెల్త్ క్రీడల్లో వరుసగా రెండోసారీ స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. పురుషుల ఫ్రీస్టైల్ 65 కేజీల విభాగంలో తలపడిన పూనియా.. కెనడాకు చెందిన లాచలాన్ మెక్నీల్ను ఫైనల్లో 2-9 పాయింట్ల తేడాతో ఓడించి బంగారు పతకం సాధించాడు.
2014 కామన్వెల్త్ క్రీడల్లో సిల్వర్ మెడల్తో సరిపెట్టుకున్న ఈ 28 ఏళ్ల స్టార్ రెజ్లర్.. 2018లో వేల్స్కు చెందిన కేన్ చారిగ్ను ఓడించి స్వర్ణం సాధించాడు. ఈసారి మళ్లీ తన మ్యాజిక్ రిపీట్ చేసి స్వర్ణం తన ఖాతాలో వేసుకున్నాడు.
𝘼𝙗𝙨𝙤𝙡𝙪𝙩𝙚 𝙙𝙤𝙢𝙞𝙣𝙖𝙩𝙞𝙤𝙣 ! @BajrangPunia defends his freestyle 🤼♀️ 65 KG 🥇 in style for team 🇮🇳 @birminghamcg22 . This is India’s 7th Gold Medal at the ongoing #commonwealthgames2022 . #ekindiateamindia #b2022 pic.twitter.com/Pn7c5AGMuq
— Team India (@WeAreTeamIndia) August 5, 2022