కోల్‌కతా: వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న బంగ్లాదేశ్.. సెమీస్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. ఈ టోర్నీలో ఇప్పటికే దక్షిణాఫ్రికా వంటి పెద్ద జట్టును ఓడించిన నెదర్లాండ్స్ 87 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. శనివారం డబుల్ హెడర్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన పోరులో డచ్ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది.
మొదట నెదర్లాండ్స్ 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (68) టాప్ స్కోరర్ కాగా.. బంగ్లా బౌలర్లలో మెహదీ, ముస్తఫిజుర్, తస్కీన్, షరీఫుల్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో బంగ్లా 42.2 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. మెహదీ హసన్ (35) ఒక్కడే కాస్త పోరాడాడు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ మీకెరెన్ 4 వికెట్లు తీశాడు.