లండన్: పొట్టి ఫార్మాట్లో లంకను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. వన్డేల్లోనూ సిరీస్‌ను హస్తగతం చేసుకుంది. గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో వన్డేలో ఆతిథ్య ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట లంక 9 వికెట్లకు 241 పరుగులు చేయగా.. ఛేజింగ్‌లో ఇంగ్లండ్ 43 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది.